అర్హత ఉన్న ప్రతి కుటుంభానికి సంక్షేమపథకాలు -మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
–వర్షంలోనూ సాగిన గడప గడపకూ …
— ప్రతి ఇంటా పెద్దాయనకు ఆత్మీయస్వాగతం
చౌడేపల్లె ముచ్చట్లు:

రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి కుటుంభానికి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని మంత్రి వర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం చౌడేపల్లె మండలంలోని పరికిదొన పంచాయతీ దొనపల్లెలో గడప గపడకు మనప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఇంటిటా పెద్దయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. మూడేళ్ల పాలనలో ప్రతి ఇంటికీ అర్హత ను బట్టి లబ్దిపొందిన పథకాలను వివరిస్తూ ముద్రించిన బావుటా పుస్తకాలను చదివి వినిపిస్తూ , ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలపై అడిగి తెలుసుకొన్నారు. ఇంకనూ ఎలాంటి సమస్యలు ఉన్న తెలియజేయాలని ప్రజలను కోరారు. సమస్యలను తెలుసుకొని అక్కడిక్కడే పరిష్కరిస్తూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గడప గపడకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా , తమప్రభుత్వానికి ఓటు వేయని వారికి కూడా జగనన్న ప్రభుత్వంలో పక్కా గృహాలు, ఫింఛన్లుతోపాటు అనేక పథకాలను పారదర్శకంగా అమలు చేసి లబ్దిపొందేలా చేస్తున్న ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. గ్రామీణ ప్రాంతాలను ఆదర్శంగా అభివృద్ది చేశామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకంటే అధికంగా చేసి దేశంలోని ఇతర రా ష్ట్రా ల మన వైపు చూసేలా పాలన సాగిస్తున్నామన్నారు. ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు తమపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసీ సభ్యుడు దామోద ర రాజు, ఎంపీపీ రామమూర్తి, బోయకొండ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్‌నారాయణ,మంత్రి పిఏ మునితుకారం, మాజీ ఎంపీపీలు రుక్మిణమ్మ, సింగిల్‌విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి, వెంకటరెడ్డి, కోఆప్షన్‌మెంబర్ సాధిక్ భాషా,సర్పంచ్ లక్ష్మిదేవమ్మ, ఎంపీటీసీ శ్రీరాములు ,స్రర్పంచుల సంఘ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, డిసిసిబి డైరక్టర్ రమేష్‌బాబు, ఏఎంసీ డైరక్టర్ సుబ్రమణ్యం,నేతలు చలపతినాయుడు, టి.నాగరాజ,వెంకటరెడ్డి, రామకృష్ణ, బాబు,నాగభూషణరెడ్డి, వెంకటరమణ,మహమ్మద్ షఫీ తదితరులు పాల్గొన్నారు.
Tags: Welfare schemes for every eligible family – Minister Dr. Peddireddy Ramachandra Reddy
