పుంగనూరులో అర్హులకు సంక్షేమ పథకాలు
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటిలో అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలు అందించి , ఆదర్శ మున్సిపాలిటిగా నిలుస్తామని మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా అన్నారు. శనివారం పట్టణంలోని మేలుపట్లలో కమిషనర్ నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో చైర్మన్ అలీమ్బాషా రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్నబావుట సంక్షేమ పుస్తకాలను లబ్ధిదారులకు వివరించారు. లబ్ధిదారులు తమకు అన్ని విధాల సహాయపడుతున్న ప్రభుత్వానికి రుణపడి ఉన్నామంటు కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ మాట్లాడుతూ పట్టణంలోని 31 వార్డుల్లోను వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల కృషి ఫలితంగా సమస్యలు కానరాలేదని తెలిపారు. అర్హులైన పేదలందరికి మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు సంక్షేమ పథకాలు అందించి ఆదర్శంగా నిలిచామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు సిఆర్.లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు అమ్ము, జయభారతి, భారతి, రేష్మా, కమలమ్మ, కాళిదాసు , జెపి.యాదవ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
Tags: Welfare schemes for the deserving in Punganur