పుంగనూరులో అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలు – మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 

రాష్ట్రంలో కులమతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం పుంగనూరు సమీపంలోని నక్కబండలో వైఎస్‌ఆర్‌ జగనన్నకాలనీల శంఖుస్థాపన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిధులుగా మంత్రి పెద్దిరెడ్డి, డిప్యూటి సిఎం నారాయణస్వామి, ఎంపీలు రెడ్డెప్ప, గురుమూర్తి హాజరైయ్యారు. మంత్రి పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. అక్కడే కాలనీలో వెహోక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 1.60 లక్షల గృహాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఇంటి పట్టాలు కాగితాలకే పరిమితమైందని ఎద్దెవా చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆశించిన మేరకు రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గతంలో లబ్ధిదారులకు మెటిరియల్‌ లేక , బిల్లులు రాక గృహాలు అసంపూర్తిగా నిలిపేశారని తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి ఇల్లు నిర్మించేందుకు లబ్ధిదారులకు అవకాశాలు ఇచ్చి , ప్రభుత్వమే నిర్మించేందుకు కూడ చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి నిర్వహించిన పాదయాత్రలో చూసినవి, విన్నవి కలసి మ్యానిఫెస్టోగా తయారు చేసి, వాటిని నవరత్నాలుగా నిర్ణయించి ఆ పథకాలను 22 నెలల కాలంలో అమలు చేసి, ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని స్పష్టం చేశారు.అలాగే కాలనీలో అన్ని మౌలికవసతులు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. మున్సిపాలిటిలో 1532 గృహాలు సిద్దమౌతోందని తెలిపారు. అలాగే 1500 మందికి ఇండ్ల పట్టాలు మంజూరు చేసి, పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. లబ్ధిదారులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ద్వారకనాథరెడ్డి, శ్రీనివాసులు, వెంకటేగౌడ, నవాజ్‌బాషా, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌, పెద్దిరెడ్డి, కొండవీటి నాగభూషణం, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, రెడ్డెప్ప, ఉపాధిహామి రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Welfare schemes for the deserving poor in Punganur – Minister Peddireddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *