అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా పనిచేయాలి

– అభివృద్దిపనులను వేగవంతం చేయండి
-కాంట్రాక్టర్‌ల సమావేశంలో ప్రజా ప్రతినిథులు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ లబ్దిచేకూరేలా పనిచేయాలని జెడ్పిటిసీ సభ్యుడు దామోదరరాజు, మండల పార్టీ అధ్యక్షుడు రామమూర్తి లు సూచించారు. మంగళవారం మండలంలోని కాటిపేరి గ్రామ సచివాలయంలో అభివృద్దిపనులపై మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలమేరకు కాంట్రాక్టర్లు, అధికారులతో సమావేశం జరిగింది. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయం పరిధిలో సిమెంటు రోడ్డు పనులన్నీ పూర్తిచేశారని అభినందించారు. రూ:95.04 లక్షల వ్యయంతో మంజూరైన సచివాలయం, ఆర్‌బికె. విఎల్‌ఎస్‌, బిఎంసీయూ భవనాల నిర్మాణ పనులను త్వరగా నెలరోజుల్లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యతను పాటించాలన్నారు.పనులు పూర్తిచేసిన వెంటనే బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని పిఆర్‌ ఏఈ పురుషోత్తం కు సూచించారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పనులు చేయాలని కోరారు.అనంతరం పనులను పరిశీలించి సూచన లిచ్చారు.. ఈ సమావేశంలో వైద్యాధికారి దినేష్‌రెడ్డి,పంచాయతీ కార్యదర్శి జాకీర్‌,వైఎస్సార్‌సీపీనేతలు సుధాకర్‌రెడ్డి, రాజప్ప, శ్రీనివాసులు, చంద్ర, రాజారెడ్డి తదితరులున్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags; Welfare schemes should work to ensure that all are eligible

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *