Natyam ad

అయ్యన్న పిర్యాదు

విశాఖపట్నం ముచ్చట్లు:


తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై సోషల్‌మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ విశాఖలో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడితో పాటుగా టిడిపి నేతలు నగర సీపీకి ఫిర్యాదు చేశారు.సోషల్ మీడియాలో దుష్పచారానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.నారా లోకేష్ ను నకిలీ పోస్ట్‌ల ద్వారా టార్గెట్ చేస్తున్నారని,మనోభావాలు దెబ్బతీసే విదంగా వ్యవహరిస్తున్నారని,నారా లోకేష్ ప్రతిష్టను తగ్గించాలనే ఉద్దేశ్యంతో పెట్టిన  పోస్టింగ్ లై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించామని తెలిపారు.నిరాధారమైన ఆరోపణలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్పప్తి చేశారు.

 

Tags: What a complaint

Post Midle
Post Midle