Natyam ad

అమిత్‌షా తెలంగాణలో చెప్పిందే ఇక్కడ అమలు చేస్తారు.

-ముస్లింల రిజర్వేషన్లు 4 శాతం తీసేస్తారు
– సీఐఏ అమలు చేయమని తీర్మాణం చేశాం
– బాబుకు అధికార దాహాం
– సిగ్గులేకుండ ఎవరితోనైన పొత్తులు
– మంత్రి పెద్దిరెడ్డి అగ్రహం

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

కేంద్ర మంత్రి అమీత్‌షా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ముస్లింల రిజర్వేషన్లు 4 శాతం తీసేస్తామన్నారని , వారి ప్రభుత్వం వస్తే ఆంధ్రాలో కూడ రిజర్వేషన్లు తీసేసి ముస్లింలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తారని, ముస్లింల భవిష్యత్తుకు రిజర్వేషన్లు ఎంతో అవసరమని … సీఐఏ ను ఏపిలో అమలు చేసేది లేదని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లిలో తీర్మాణం చేయించారని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలో నూతనంగా రూ.25 లక్షలతో నిర్మించిన అంజుమన్‌ షాదీమహాల్‌ను చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లింలతో జరిగిన సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముస్లింల కోసం 7 శాతం రిజర్వేషన్లు చేస్తే వాటిని చంద్రబాబునాయుడు సుప్రీం కోర్టుకు తీసుకెళ్లి 4 శాతానికి తగ్గించాడని మంత్రి తెలిపారు. ముస్లింలపై చంద్రబాబు కపటప్రేమ చూపిస్తున్నాడని , ముస్లింలు దీనిని గమనించాలన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ముస్లింల అభివృద్ధికి చేస్తున్న కృషి, అందిస్తున్న సహకారం గమనించాలన్నారు.

 

 

 

జిల్లాలో ఎక్కడా లేని విధంగా పుంగనూరులో షాదీమహాళ్లు, మసీదుల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదరికమే ప్రామానికంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారని మంత్రి పెద్దిరెడ్డి కొనియాడారు. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మ్యానిఫెస్టోను 100 శాతం పూర్తి చేసి ఓట్ల కోసం వెళ్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు మ్యానిఫెస్టోలో ఒక్క హామినైన నేరవేర్చారా అంటు నిలధీశారు. జన్మభూమి కమిటిల పేరుతో తెలుగుదేశం వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందించి రాష్ట్రాన్ని పచ్చనాయకుల పరం చేశాడని విమర్శించారు. ప్రతి ఒక్కరు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించి రెండవ సారి ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

 

 

 

బాబుకు అధికార దాహాం పట్టిందని మంత్రి ఎద్దెవా చేశారు. అధికారం కోసం ఏపార్టీతోనైన పొత్తులు పెట్టుకోవడానికి చంద్రబాబుకు సిగ్గులేదని తెలిపారు. గతంలో ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించి , ఆతరువాత కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు తిరిగి బిజెపితో అధికారం కోసం పొత్తులు పెట్టుకోవడాన్ని ప్రజలు గమనించాలన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు వైఎస్సార్‌సీపీకి రెండు ఓట్లు వేసి చంద్రబాబును చిత్తుగా ఓడించి రాష్ట్రానికి పట్టిన చంద్రబాబు పీడను వదిలించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధీన్‌షరీఫ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు ఎంఎస్‌.సలీం , వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, రెడ్డెప్ప, ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: What Amit Shah said in Telangana will be implemented here.

Post Midle