ఇవేమి గుడ్లు… ఇలా తినేది ఎలా

What are the eggs ... how to eat like this

What are the eggs ... how to eat like this

Date:19/07/2018
ప్రకాశం ముచ్చట్లు:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మహిళా, శిశు సంక్షేమ శాఖ కేంద్రాల్లో అందించే గుడ్ల బరువు తక్కువగా ఉండడమేగాక వాటని ఉడికిస్తే విచ్చిపోతున్నాయి.  పెక్కు వలవగానే దుర్వాసన వస్తున్నాయి. గట్టిగా మారి రంగు మాతున్నాయి. దీంతో వీటిని తినేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. నాసిరకం గుడ్లు అందిస్తున్నారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కావాలంటే తీసుకెళ్లండి లేకపోతే ఊరుకోండంటున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గర్భిణులు, బాలింతలు, ఐదేళ్ల లోపు పిల్లలకు, కిషోర బాలికలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నాయి. ప్రతి నెలా కార్యకర్తలు పెట్టే ఇండెంట్‌ ప్రకారం టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ గుడ్లు సరఫరా చేస్తారు. ఇవి ఐదేళ్ల లోపు చిన్నారులకు ఉడికించి కేంద్రంలోని తినిపిస్తారు. గర్భిణులకు, బాలింతలకు పంపిణీ చేస్తారు.గర్భిణులు కోడి గుడ్లు తింటే ఆరోగ్యమైన బిడ్డ జన్మిస్తాడు… చిన్నారులు గుడ్లు తింటే డి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. కానీ కాంట్రాక్టర్లు, ఐసీడీఎస్‌ అధికారులు కుమ్మక్కై నాసిరకమైన గుడ్లు సరఫరా చేస్తున్నారు. సహజంగా కోడి గుడ్డు బరువు 50 గ్రాములపైనే తూగుతుంది. కానీ అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ అవుతున్నవి కేవలం 20 నుంచి 30 గ్రాముల బరువు మాత్రమే ఉంటున్నాయి. కోళ్ల ఫారాల నుంచి గుడ్లను సాధారణ మార్కెట్‌కు తరలించగా, మిగిలినవన్నీ తక్కువ ధరకు కొని సరఫరా చేస్తున్నారనే విమర్శలున్నాయి. చాలా మంది గుడ్లను ముందుగా నీళ్లలో వేసి చూసుకొంటున్నారు. తేలినవి పడేసి, మునిగినవి మాత్రమే ఉడికించి తింటున్నారు.అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చిన కోడి గుడ్లు దుర్వాసన వస్తున్నాయి. ఉడికించిన తర్వాత చూడడానికి బాగానే ఉంటుంది. కాని తినే సమయంలో అదోరకం వాసన వస్తుండడంతో తినబుద్ది కావడం లేదు. పౌష్టికాహారం పేరుతో నాసిరకం గుడ్లు ఇస్తుండడంతో అవి వృథాగా పడేయాల్సి వస్తోందంటున్నారు.
ఇవేమి గుడ్లు… ఇలా తినేది ఎలా https://www.telugumuchatlu.com/what-are-the-eggs-how-to-eat-like-this/
Tags:What are the eggs … how to eat like this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *