రెండు చోట్ల నామినేషన్లు దాఖలు దేనికి సంకేతం….?

What are the names of two nominations?
Date:23/03/2019
భువనేశ్వర్ ముచ్చట్లు:
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆందోళనలో ఉన్నారా? 19 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రెండు చోట్ల నామినేషన్లు వేయాలనుకోవడం దేనికి సంకేతం….? తాను పోటీ చేసే నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకత కన్పించిందా? ఇవన్నీ బిజూ జనతాదళ్ లో విన్పిస్తున్న ప్రశ్నలు. ఎన్నికలకు దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచే నవీన్ పట్నాయక్ సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో విజయ దుంధుభి మోగించిన తరహాలోనే ఈసారి కూడా మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అందుకోసమే రైతులు, మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఎన్నికలకు వెళుతున్నారు.ఒడిశాలో త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో అది తనకే లాభిస్తుందని నవీన్ నమ్ముతున్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చుకుంటే అది తమకే లాభిస్తుందన్న అంచనాలో నవీన్ ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పుంజుకోవడం కూడా తనకు అనూకూలంగానే నవీన్ భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూటమితో ముందుకు వెళుతున్న దాని నుంచి ప్రమాదం లేదని గ్రహించిన నవీన్ ఆ పార్టీని లైట్ గానే తీసుకుంటున్నారు. నవీన్ తాజాగా రెండు స్థానాల్లో పోటీ చేయడం చర్చనీయాంశమైంది. ఆయన ఐదు సార్లు గంజాం జిల్లా హింజలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి కూడా హింజలి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఒడిశాలో ఒక ప్రచారం చక్కర్లు కొడుతోంది. హింజలి నుంచి పోటీ చేస్తే నవీన్ ఓటమి ఖాయమని రాష్ట్ర ప్రభుత్వ నిఘా విభాగం తేల్చి చెప్పిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని బీజేపీ నేతలు కూడా బయటపెట్టడం సంచలనం కల్గించింది. హింజలి నుంచి నవీన్ బరిలోకి దిగితే ఓటమి ఖాయమని ఇంటలిజెన్స్ నివేదకి ఇచ్చిందంటున్నారు.
హింజలిలో ప్రజా సౌకర్యాలను మెరుగు పర్చడంలో నవీన్ ఫెయిల్ అయ్యారన్నది ఆ రిపోర్ట్ సారాంశం. అందుకే హింజలి ప్రజలు నవీన్ పై వ్యతిరేకతతో ఉన్నారని తేల్చింది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ నవీన్ తీసుకున్న నిర్ణయంతో అది నిజమేనని పిస్తోంది. నవీన్ పట్నాయక్ హింజలి తో పాటు బిజేపూర్ నుంచి కూడా పోటీ చేయనున్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బిజేపూర్, హింజలి నుంచి నవీన్ పోటీ చేస్తారని చెప్పడంతో ఆయన హింజలిలో నెగ్గలేమని భయపడి బిజేపూర్ ను ఎంచుకున్నారన్న ప్రచారాన్ని విపక్షాలు జోరుగా చేస్తున్నాయి. మొత్తం మీద నవీన్ రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతుండటం హాట్ టాపిక్ గా మారింది.
Tags:What are the names of two nominations?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *