అసలు రాహుల్  గాంధీ కన్నెవరికి  గీటాడు? 

What does Rahul Gandhi do?

What does Rahul Gandhi do?

Date:20/07/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్‌సభలో చోటు చేసుకున్ననాటకీయ పరిణామం ఫై సర్వత్రా చర్చనీయంశామైంది.ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరకు వెళ్లి కోపాన్ని తగ్గిస్తానంటూ రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకున్నారు. ఊహించని ఈ చర్యతో మోదీ తొలుత తత్తరపాటుకు గురైనా ఆ తర్వాత తేరుకుని రాహుల్ భుజం తట్టి నవ్వారు. అనంతరం రాహుల్ తన సీటులోకి వెళ్లి కూర్చున్నారు. అయితే ఆ తర్వాత రాహుల్ కన్ను గీటారు. ఎవరిని చూసిఎందుకు కన్నుగీటారో తెలియదు గానీ,అధికార పార్టీకి భలే ఝలక్ ఇచ్చాను కదా అన్నట్టుగా ఎవరినో చూసి రాహుల్ కన్ను గీటడం సమావేశాలను వీక్షిస్తున్న ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.మొత్తం మీద అప్పటివరకూ మోదీ, అమిత్ షాలపై విమర్శలతో విరుచుకుపడిన రాహుల్ ఊహించని విధంగా ఇలా ప్రవర్తించడంతో రాజకీయ వర్గాల్లో రాహుల్ కూడా చమత్కారాన్ని వంటబట్టించుకున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. రాహుల్ ఇలా చేయాలని చర్చ ప్రారంభం కాకముందే నిర్ణయించుకుని ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా ఈ చర్యతో కాంగ్రెస్ అధ్యక్షుడు హాట్ టాపిక్‌గా మారారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి వాటిని నిశితంగా పరిశీలించే సోషల్ మీడియా పేజ్ అడ్మిన్లు మెమ్స్ వీడియోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అసలు రాహుల్  గాంధీ కన్నెవరికి  గీటాడు? https://www.telugumuchatlu.com/what-does-rahul-gandhi-do/
Tags:What does Rahul Gandhi do?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *