Natyam ad

ఫిబ్రవరి 19న ఏం జరిగిందంటే

హైదరాబాద్   ముచ్చట్లు:

 

 

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నవీన్ హత్య కేసు విషయంలో ఆరోజు ఏం జరిగిందనే దానిపై పూర్తి వివరాలను తెలిపాడు హరిహరకృష్ణ. అలాగే ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఏ విధంగా

Post Midle

ప్రవర్తించాడు.. ఆరోజంతా నవీన్ తో కలిసి ఎక్కడెక్కడ తిరిగాడు, ఏం చేశాడు వంటి విషయాల గురించి పోలీసులు తెలిపారు. తనను నమ్మి తనతో వచ్చిన స్నేహితుడినే ఏ విధంగా మట్టుబెట్టాడు వంటి పూర్తి

వివరాలను వెల్లడించారు. ఎంత క్రూరంగా, ఎందుకు చేశాడో స్పష్టం చేశాడు. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 9 గంటలకు హరిహరికృష్ణకు నవీన్ ఫోన్ చేసి హైదరాబాద్ కు వస్తున్నట్లు చెప్పాడు. అతడిని కలిసే

లోపు హరిహర నగరంలోని మరో మిత్రుడికి ఫోన్ చేశాడు. ఉదయం 10.45 గంటలకు ఇద్దరూ కలిసి ఉప్పల్ వెళ్లారు. అక్కడ ఒక మాల్ లోని థియేటర్ లో హాలీవుడ్ సినిమా చూశారు. అదే సమయంలో

అంటే మధ్యాహ్నం 1 గంటలకు నవీన్ నుంచి హరిహరకృష్ణకు ఫోన్ వచ్చింది. తాను ఎల్బీనగర్ లో ఉన్నట్లు సమాచారం ఇచ్చాడు. ఇద్దరు మిత్రులు కలిసి ఎల్బీనగర్ వెళ్లి నవీన్ ను నాగోల్ కు

తీసుకువచ్చారు. రెస్టారెంట్ లో ముగ్గురు కలిసి భోజనం చేశారు. తర్వాత నవీన్ ను తీసుకొని హరిహర మూసారాంబాగ్ లోని తన సోదరి ఇంటికి చేరాడు. ఇద్దరు మాట్లాడుకుంటుండగా… హరిహర కృష్ణకు ఓ

స్నేహితురాలి నుంచి ఫోన్ వచ్చింది. కొత్త ఫోన్ కొనేందుకు సహకరించమని కోరింది. దీంతో నవీన్ సాయంత్రం 5 గంటలకు చైతన్యపురిలోని మొబైల్ దుకాణానికి వెళ్లాడు. సదరు స్నేహితురాలు ఫోన్

కొనేందుకు మరింత డబ్బు కావాలని రిక్వస్ట్ చేసింది. దీంతో నవీన్ సాయంత్రం 5 గంటలకు చైతన్యపురిలోని మొబైల్ దుకాణానికి వెళ్లాడు. సదరు స్నేహితురాలు ఫోన్ కొనేందుకు మరికొంత డబ్బు

కావాలని కోరగా.. దీంతో లోన్ యాప్ లో రూ.14 వేలు పేటీఎం పోస్ట్ పెయిడ్ లో రూ.4 వేలు అప్పు తీసుకున్నారు. మొత్తం రూ.30 వేల ఖరీదైన ఫోన్‌ ఆ స్నేహితురాలు కొనుక్కొని వెళ్లింది. ఆ తర్వాత

నవీన్, హరిహరకృష్ణ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తాను ఎంజీ వర్సిటీకి వెళ్తానని నవీన్ చెప్పాడు. ఇదే అదనుగా హరిహరకృష్ణ.. తానే అతడిని హాస్టల్ లో దింపుతానని చెప్పాడు. ఈ క్రమంలోనే ఓ కత్తి,

గ్లౌజులు ఉన్న బ్యాగును వెంట తీసుకెళ్లాడు. రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరూ కలిసి ఇంటి నుంచి బయలు దేరారు. పెద్ద అంబర్ పేటలోని తిరుమల వైన్స్ కు చేరుకొని అక్కడ నవీన్ తో మద్యం

తాగించాడు. రాత్రి 11.30 గంటల వేళ ఔటర్ రింగ్ రోడ్డు దాటారు. దారిలో నవీన్ ప్రేమించిన యువతితో మాట్లాడమని అతనికి ఫోన్ ఇచ్చాడు. అనంతరం సదరు యువతికి సంబంధించిన ఓ రహస్యం

చెబుతానంటూ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే మిత్రుడిని గొంతు నులిమి చంపి ఆపై శరీర భాగాలను వేరు చేశాడు.

Tags;What happened on February 19?

Post Midle