What happened to the city of Visakhapatnam .

 విశాఖ నగరానికి ఏమైంది…

Date:03/12/2020

విశాఖపట్టణం ముచ్చట్లు:

విశాఖ నగరంలో విష సంస్కృతి శరవేగంగా విస్తరిస్తోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ తప్పటడుగులు వేస్తోంది నగర యువత. సోషల్‌ మీడియా వేదికగా జీవితాలను నాశనం చేసుకుంటోంది. డ్రగ్స్‌కు టెలిగ్రామ్‌.. బైక్‌ రేసింగ్‌లకు వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకుని కొత్త పంథాలకు తెరలేపుతున్నారు. ఇందుకు ఇటీవల పట్టుబడిన.. ప్రస్తుతం పట్టుబడుతున్న ఘటనలే నిదర్శనం.ఓ వైపు డ్రగ్స్‌..మరోవైపు బైక్‌ రేసింగ్‌లు.. ఆన్‌లైన్‌లో గుట్టుచప్పుడు కాకుండా దందా.. డ్రగ్స్‌కు బిట్‌కాయిన్‌ రూపంలో చెల్లింపులు.. బైక్‌ రేస్‌లకు వాట్సాప్‌ ద్వారా పేమెంట్లు.. విష సంస్కృతి వైపు విశాఖ యువతమీకు డ్రగ్స్‌ కావాలా.. ఎక్కడో గోవాకు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇక్కడే వైజాగ్‌లో దొరికేస్తుంది. నిజమే శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న విశాఖలో విష సంస్కృతి అంతే వేగంగా పరుగులు పెడుతుంది. నిషేధిత డగ్స్ కోసం ఎక్కడికో వెళ్లకుండా ఇటు వినియోగదారులు, అటు విక్రయదారులు ఏకంగా ఆన్‌లైన్‌లోనే తెప్పించుకుంటున్నారు. విద్యావంతులే ఇలాంటి చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. తాము వినియోగించడంతో పాటు విద్యార్థులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో హైదరాబాద్‌, బెంగళూరు, గోవా ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ను తెప్పించుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మార్చేశారు. టెక్నాలజీని ఆధారంగా చేసుకుని ఇంట్లోనే ఉంటూ సరుకు తెప్పించుకుంటున్నారు. ప్రత్యేక కోడ్‌ లాంగ్వేజ్‌, వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారా క్రయ, విక్రయాలు జరుపుతున్నారు.

 

కొద్ది రోజుల క్రితం పోర్టు క్వార్టర్స్‌ దగ్గర కొంతమంది డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి…నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 10న రుషికొండ దగ్గర హోటల్‌ నిర్వహించే వర్మరాజు డ్రగ్స్‌ విక్రయిస్తున్నారనే ముందస్తు సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అరవింద్‌ అగర్వాల్‌ ముఠా పోలీసులకు పట్టుబడింది. ఈ మూడు ఘటనల్లోనూ పోలీసులు హానికరమైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులకు చిక్కకుండా…కోడ్‌ లాంగ్వేజ్‌ యూజ్‌ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కొకైన్‌ అయితే ‘ సీ’ అని, ఎండీఎండీ అయితే ‘ ఎం’ అని, గంజాయి అయితే ‘ జే’ అని… ఇలా ప్రత్యేకమైన కోడ్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ప్రాంతాల వారీగా వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసుకుని తాము కలిసే చోటు, సమయాలను నిర్దేశించుకున్నట్లు తేలింది. ఇలా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పోలీసులుకు సైతం సవాల్ విసురుతున్నారు.మరోవైపు విశాఖలో బైక్ రేసింగ్ కొత్తేమీ కాదు. కొన్నేళ్లుగా జరుగుతున్నదే.

 

 

పోలీసులు రైడ్స్ చెయ్యడం… రేసర్లను పట్టుకోవడం…కేసులు బుక్ చేయ్యడం…మళ్లీ వదిలేయడం శరమూములే. ఇంతకుముందు వీకెండ్‌లో మాత్రమే జరిగే బైక్‌ రేస్‌లు..ఇప్పుడు నిత్యం జరుగుతున్నాయి. ఇక్కడ కూడా వాట్సాప్‌ గ్రూప్‌లు క్రియేట్‌ చేసుకుని…వివిధ రకాల పేర్లతో రేసింగ్‌లకు పాల్పడుతున్నారు. అంతేకాదు పేమెంట్‌లు కూడా అక్కడే జరిగిపోతుంటాయి. సింగిల్ టైర్ రైడ్, సైడ్ హ్యాంగింగ్ రైడ్, జిగ్ జాగ్, స్నేక్ రైడ్, 360 డిగ్రీస్, 120 యాంగిల్, ఫ్రంట్ లీ, బ్యాక్ లీ.. పేర్లతో పిలిచే డేంజరస్‌ స్టంట్‌లకు పాల్పడుతున్నారు. విశాఖలో ఒక్క వారం వ్యధిలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 211 బైక్‌లు సీజ్ చేశారంటే…పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకొవొచ్చు.ఓ వైపు డ్రగ్స్…మరోవైపు బైక్‌ రేసింగ్‌లు..వీటి మోజులో పడి బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటుంది విశాఖ యువత. పోలీసులు చర్యలు తీసుకుంటారులే అని వదిలేయకుండా.. తల్లిదండ్రులు కూడా పిల్లలపై నిఘా పెట్టాలి. లేదంటే.. పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉంటుంది.

 

భర్తను చంపేందుకు 10 లక్షల సుపారి

Tags:What happened to the city of Visakhapatnam .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *