ధర్డ్ వేవ్ కట్టడికి ఏం చేస్తున్నారు

డెహ్రాడూన్  ముచ్చట్లు:

 

కోవిడ్ థర్డ్ వేవ్ సన్నద్ధత, కట్టడికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుందనే అంశంపై ఉత్తరా‌ఖండ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలయ్యింది. ఈ వ్యాజ్యంపై గురువారం విచారణ సందర్భంగా జస్టిస్ ఆర్ఎస్ చౌహన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మల ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. థర్డ్ వేవ్,డెల్టా ప్లస్ వేరియంట్‌ను నిరోధించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై హైకోర్టు పెదవి విరిచింది. పిల్లల్ని కాపాడుతామని అంటున్నారుగానీ, అందుకు తగిన ఏర్పాట్లు మాత్రం చేయరని ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ కార్యదర్శ అమిత్ నేగి‌ని మందలించింది.‘‘డెల్టా వేరియంట్ నెల రోజుల్లో దేశమంతటా వ్యాపించింది.. డెల్టా ప్లస్ విజృంభణకు మూడు నెలల సమయం తీసుకోదు.. ఏ విధంగా చిన్నారులను రక్షించాలని అనుకుంటున్నారు.. డెల్టా ప్లస్ వేరియంట్ రానివ్వండి అప్పుడు చూద్దాం అన్నట్టుంది ప్రభుత్వ వైఖరి’’ అని ధర్మాసనం మండిపడింది. ‘మమ్మల్ని మోసం చేయడం ఆపండి.. వాస్తవికత ఏంటో మాకు తెలుసు.. ఉత్తరాఖండ్‌లో రామ రాజ్యం ఉందని, మనం స్వర్గంలో జీవిస్తున్నామని ప్రధాన న్యాయమూర్తికి చెప్పకండి’ అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది.‘మహమ్మారి సమయంలో ఓ యుద్ధం మాదిరిగా పనిచేయాల్సిన అవసరం ఉంది.. వ్యాధి నియంత్రణ ప్రక్రియలను జాప్యం చేయడానికి అధికార యంత్రాంగానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు’అని వ్యాఖ్యానించింది.

 

 

 

 

అంతేకాదు, సరిపడేన్ని అంబులెన్స్‌లు ఉన్నాయా అని ప్రభుత్వాన్ని నిలదీసింది. ‘‘అవసరాలకు సరిపడేన్ని అంబులెన్స్‌లు ఉన్నాయని అబద్దాలు చెబుతున్నారు.. మీరు రాష్ట్రంలో తగినన్ని అంబులెన్స్‌ల గురించి మాట్లాడుతారు.. కొండ ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలకు అంబులెన్స్‌లు రాలేదని తరచూ నివేదికలు వస్తున్నాయి.. వారిని డోలీల్లో తీసుకొస్తున్నారు’’అని రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టింది.అనంతరం విచారణను జులై 7కు వాయిదా వేసిన న్యాయస్థానం.. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేస్తూ పూర్తి వివరాలతో కూడిన అఫిడ్‌విట్‌ను దాఖలు చేయాలని సూచించింది. అంతేకాదు, తదుపరి విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శులు హాజరుకావాలని ఆదేశించింది. కాగా, ఇప్పటి వరకూ ఉత్తరాఖండ్‌లో 3,39,127 మంది కోవిడ్ బారిపడగా.. 7,068 మంది మృతిచెందారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: What is being done to the Third Wave building

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *