రేపు అధికార తెలంగాణ పార్టీలో ఏమిజరుగబోతుంది?

Date:16/01/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చెంద్రశేఖర్ రావు దుబ్బాక ఉపఎన్నిక ,గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ ఎన్నికలో ఓటమి ,… ఢిల్లీ పర్యటన తో  వచ్చిన మార్పులను వివిధ రాజకీయ పార్టీలు ,రాజకీయ విశ్లేషకులలో ఎన్నో సందేహాలు,అనుమానాలు కలుగుతున్నాయి.అంతకు ముందు కేంద్ర  ప్రభుత్వాన్ని తనదైన  భాషలో దూషించి,భవిష్యత్తులో మరో జాతీయ పార్టీకి ఫెడరల్ ఫ్రెంట్ నామకరణ కూడా చేశారు.అందుకు తగట్టుగా ,పశ్చిమ బెంగాల్,త్తమిళనాడు ,ఝార్ఖండ్ ,కర్ణాటక ,ఉత్తరప్రదేశ్ ,వంటి ప్రాంతీయ పార్టీనాయకుకలు కలిసి చర్చలు జరిపారు. మరి అవన్నీ ఇప్పుడు ఎంత వరకు వచ్చాయంటే సమాదానం దొరకని ప్రశ్న?రేపు అధికార తెలంగాణ పార్టీలో ఏమిజరుగబోతుంది?ఈ రెండు ఎన్నికల ఓటమి,..బిజెపి అభ్యర్థుల విజయం తో ఆ పార్టీ శ్రేణులలో వచ్చిన జావసత్వాలు   రేపటి అసెంబ్లీ కి పరుగులు పెట్టిస్తుంది..ఈ లోపు ముఖ్యమంత్రి చెంద్రశేఖర్  రావు 80 వేల కోట్ల రూపాయలతో నిర్మిచిన భారీ నీటి పారుదల కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని సర్వత్రా విమర్శల నెపథ్యంలో సెంట్రల్ క్రైమ్ బ్యూరో (సిబిఐ)  ఈ  ప్రాజెక్ట్ కోసం ఎక్కడెక్కడ మిషినరీ కొనుగోలు చేసిన వివరాలు సేకరించి దగ్గర పెట్టుకొని,ముఖ్యమంత్రిని లొంగతీసుకుందని ప్రధాన కాంగ్రెస్ పార్టీ విమర్శలు  చేస్తుంది.కాంగ్రెస్ పార్టీ తో పాటు రాష్ట్ర బీజేపీ శాఖ మరో అడుగుముందుకువేసి ముఖ్యమంత్హ్రి ప్రధాన మంత్రి కాలు  మొక్కిన వదలకుండా జైల్లో చిప్పకూడు తినపెడుతామని కరీంనగర్ ఎంపీ ,రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వార్నింగ్ ఇస్తున్నారు.ఈనేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రస్తుతం కోరలు పీకిన పాము మాదిరిగా మారారని వాళ్ళ పార్టీ నాయకులు నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags; What is going to happen in the ruling Telangana party tomorrow?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *