Natyam ad

టీడీపీ గేమ్ ప్లాన్ ఏంటీ

గుంటూరు ముచ్చట్లు:


వచ్చే ఎన్నికల్లో పొత్తుల్లేకుండానే పోటీచేయాలని టీడీపీ భావిస్తుందా? ఇటీవల చేయించుకున్న సర్వేల్లో టీడీపీకి సానుకూల ఫలితాలు వచ్చాయా? ప్రభుత్వ వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని టీడీపీ నేతలు నమ్ముతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాము పొత్తుల్లేకుండా ఒంటరిగానే పోటీచేయబోతున్నామని టీడీపీకి చెందిన ముఖ్యనేత ఒకరు చెప్పారు. ‘పొత్తుల్లేకుంటే టీడీపీ గెలవలేదు. అందుకే ఆ పార్టీ వివిధ పార్టీలతో పొత్తుల కోసం అర్రులు చాస్తోందనే అపవాదు ఉంది. ఈ అపోహలను తొలగించాలి. సొంతంగా బలపడేట్లు ముందుకెళ్లాలి. అందుకోసం ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు! అంటూ సదరు నేత అన్నారు. ఇందులో భాగంగానే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు తెలుగు దేశం పార్టీ పొత్తుల్లేకుండా టీడీపీ ఎన్నికలను గెలవలేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన, బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అర్రులు చాస్తోంది అనే భావన ప్రజల్లో నెలకొన్నది. అందువల్లే కేంద్రంలోని బీజేపీ పెద్దలను టీడీపీ నేతలు పల్లెత్తు మాట అనడం లేదని జనం భావిస్తున్నారు. అయితే తాము రాష్ట్రంలో బలంగా ఉన్నామని వచ్చే ఎన్నికల్లో సొంతంగానే పోటీచేస్తామని.. ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారట. అయితే అందుకోసం పార్టీని క్షేత్ర స్థాయిలో పూర్తిగా బలోపేతం చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారట.

 

 

ఇటీవల జనసేన గ్రాఫ్పెరిగిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ప్రజా సమస్యలపై పవన్కల్యాణ్చేస్తున్న పోరాటాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని జనసైనికులు ఉత్సాహంగా ఉన్నారు. గుంతల రోడ్లు, కౌలు రైతు భరోసా యాత్ర, జనవాణి వంటి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీ సర్కారు కూడా టీడీపీ ఆందోళనలకు పెద్దగా స్పందించకుండా పవన్ తీసుకున్న అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇది వైసీపీ వ్యూహాత్మక ఎత్తుగడ కావొచ్చు. ప్రభుత్వ వ్యతిరేకత రేపు జనసేన వైపు మళ్లిందంటే టీడీపీ విజయానికి గండి పడుతుందన్న టీడీపీ ఆందోళన చెందుతోందట. దీంతో జనవరి చివరి కల్లా నారా లోకేష్ చేపట్టే పాదయాత్రతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేయడం ద్వారా వైసీపీకి ప్రత్యామ్నాయం టీడీపీ మాత్రమేననే సంకేతాలు పంపాలని యోచిస్తోంది. అందుకనుగుణంగా కార్యాచరణ చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది.టీడీపీ చేపట్టే ప్రత్యేక కార్యాచరణ ఏమై ఉంటుందనే దానిపై వైసీపీ, జనసేన పార్టీల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలతోపాటు కేంద్రాన్ని కూడా టీడీపీ టార్గెట్చేస్తుందా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అటువంటి నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీకి వామపక్షాలు మద్ధతు తెలిపే అవకాశముంది. జనసేనానిపై ఒత్తిడి పెరుగుతుంది. పవన్అటో ఇటో తేల్చుకోవాల్సివస్తుంది. దీంతో బీజేపీ, జనసేన, వైసీపీ వర్సెస్టీడీపీ, వామపక్షాలు, కాంగ్రెస్‌గా రాజకీయాలు మలుపు తిరిగే అవకాశముంది. టీడీపీ అంత దూకుడుగా అప్పుడే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా.. ఇంకా కొంతకాలం వేచి చూసే ధోరణిని కొనసాగిస్తుందా ! అసలు ప్రత్యేక కార్యాచరణలో ఏముంటుందనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

 

Post Midle

Tags: What is TDP’s game plan?

Post Midle