Natyam ad

వైజాగ్ లో కొన్ని ప్రాంతాలకు ఆ పేరుతో ఉన్న సంబంధం ఏమిటి ?

విశాఖపట్నం ముచ్చట్లు:


..ఆ పేరు ఎలా వచ్చింది ? వైజాగ్ లో కొన్ని ప్రాంతాలకు ఆ పేరుతో ఉన్న సంబంధం ఏమిటి ?
విశాఖకు జీవ జలాలు ఇచ్చిన వాల్తేరు..అదేవాల్తేరు ఓ ఝరి.. ఓ జీవన ప్రవాహం. లక్షల మందికి తాగేందుకు నీరు..బతికేందుకు ఆసరా ఇచ్చిన సెలయేరు..తప్పితే ఒక వ్యక్తి పేరు కాదు.తూర్పు కనుమల్లో పుట్టిన నీటి గెడ్డలు..ఒకప్పుడు రెండు పెద్ద ఏటి ప్రవాహాలుగా విశాఖ మీదుగా ప్రవహించేవి. ఒకటి హనుమంత వాగు. ఇది సింహాచలం కొండల్లో పుట్టిన గెడ్డల నుంచి ముడసర్లోవ మీదుగా 15 కి.మీ.ల దూరం ప్రవహించి లాసన్స్ బే వద్ద సముద్రంలో కలిసేది. 1902లో ముడసర్లోవ పార్కు/రిజర్వాయరు నిర్మించిన తరువాత ఈ ఏరు కనుమరుగైంది. ఇప్పటి హనుమంత వాక జంక్షన్ ఆ వాగు పేరుతొ వచ్చిందే.

 

 

ఇంకొకటి వాలుతేరు/వాలుటేరు. ఎగువ తూర్పు కొండల్లో పుట్టి మేఘాద్రి గెడ్డలో కలిసి పెద్ద ఏటి ప్రవాహంగా విశాఖ నగరం మీదుగా ప్రవహించేది. 30 కి.మీ. ల దూరం వంపులు తిరుగుతూ… కొండల మధ్య వాలుగా ప్రవహిస్తూ డాల్ఫిన్ నోస్ కొండ వద్ద సముద్రంలో కలిసేది..వాలుగా ప్రవహించే ఏరు ( వాలు + ఏరు ) ..వాలుతేరు ..క్రమంగా వాల్తేరుగా అయింది. వాల్తేరు ఏటికి ఎడమ పక్కన వున్న ప్రాంతం స్థానికుల ఆవాసంగా..వారపు సంతగా ఉండేది.వందల ఏళ్ల క్రితమే డాల్ఫిన్ నోస్ వద్ద వాల్తేరు ఓడరేవు విదేశీయులకు గమ్యస్థానం అయింది. డచ్చ్, ఫ్రెంచ్, బ్రిటీష్ వాళ్ళు ఈ ఓడరేవు తమ సరుకుల రవాణాకు అనుకూలమైందిగా గుర్తించారు. 1850 తర్వాత బ్రిటీష్ వాళ్ళు Central Provinces Port, East Coast Battalion, Vizagapatam Administration District, Waltair East Coast – Railway Station ఏర్పాటుకు చర్యలు ప్రారంభించడంతో ఇక్కడికి బ్రిటీష్ అధికార్ల రాకపోకలు పెరిగాయి. డాల్ఫిన్ నోస్ వద్ద వాల్తేరుకు ప్రాచుర్యం పెరిగింది. ఆంగ్లేయులు వాల్తేరును ‘ వా..ల్..ఠే..ర్’ అని పలకడం.. Waltair గా రాయడం అలవాటై అదే కొనసాగింది. ఇది Walter అనే పేరుకు దగ్గరగా ఉండడంతో ఎవరో బ్రిటీష్ అధికారి పేరుతో వచ్చిందని పొరపాటు పడ్డం మామూలైంది.

 

 

 

Post Midle

అంతకు ముందు వాల్తేరు – పెద జాలరిపేట మధ్య ప్రాంతం అంతా ఎక్కువగా కొండగుట్టలు మాత్రమే ఉండేవి. వీటిని తొలుస్తూ Waltair Uplands, Walair Main Road, The Waltair Club ఏర్పాటు అయ్యాయి. ఓడరేవు విస్తరణతో వాల్తేరు ఒడ్డున వున్న కుటుంబాలు కొద్దిగా దూరంగా జరిగాయి. అవి China Waltair, Peda Waltair అయ్యాయి. డాల్ఫిన్ నోస్ దగ్గరలోని వాల్తేరు ఒడ్డున పోలేరమ్మ తల్లి గుడికి ప్రత్యామ్నాయంగా పెద వాల్తేరులో పోలమాంబ అమ్మవారి ఆలయం వచ్చింది. నగరానికి నీటి అవసరాలు పెరగడంతో 1970లో వాల్తేరుపై మేఘాద్రి గెడ్డ వద్ద జలాశయం నిర్మించారు. దీంతో వాల్తేరు ప్రవాహ ఝరి నిలిచిపోయింది. ఇప్పటికీ పరిశీలనగా చూస్తే వాల్తేరు ..హనుమంత వాగుల ఆనవాళ్ళు నగరం మధ్యలో ఇప్పటికీ మనకి మురుగు కాలువలై కనిపిస్తాయి.ఏ కలెక్షన్ ఫ్రం బ్రాహ్మణ సమాఖ్య.

 

Tags:What is the connection with that name to some places in Vizag?

Post Midle