Natyam ad

 కేఏ పాల్ లింక్ ఏమిటీ

కాకినాడ ముచ్చట్లు:


ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. కేఏ పాల్ అమరావతిలో మాట్లాడుతూ.. ప్రజాశాంతి పార్టీ గుంటూరు జిల్లా కమిటీ ఏర్పాటు చేశామని, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది ఆన్‌లైన్‌లో ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ప్రతి గ్రామానికి సర్పంచ్ ద్వారా కోటి రూపాయలు ఇస్తానని ఈ సందర్భంగా చెప్పారు. ఐదు సంవత్సరాలలో రాజధాని ఎందుకు కట్టలేదని చంద్రబాబును కేఏ పాల్ ప్రశ్నించారు. చంద్రబాబు 5 లక్షల కోట్లు, జగన్ నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసారు. పవన్ కళ్యాణ్ డ్యాన్స్ వేస్తే రాష్ట్రంలో అప్పులు తీరుతాయా అని అడిగారు.కేంద్ర ప్రభుత్వం తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తోందని కేఏ పాల్ ఆరోపించారు. ఛారిటీ డబ్బు ఒక్క రూపాయి కూడా పార్టీకి వాడటం లేదన్నారు పాల్. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా స్టీల్ ప్లాంట్‌లో పని చేస్తున్న 44 వేలమంది ఉద్యోగులు రోడ్డున పడతారు. నన్ను స్టీల్ ప్లాంట్‌లో కి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. విశాఖ ఉక్కును కాపాడేందుకు తన ప్రాణాలు అయినా పణంగా పెడతాను అన్నారు. మరోవైపు విశాఖ ఉక్కు ప్రవేటికరణకు వ్యతిరేకంగా పిల్ దాఖలు చేశానని తెలిపిన పాల్ గతంలో వేసిన పిల్ కు ఈ పిల్ కు సంబంధం లేదన్నారు.

 

 

 

విశాఖ ఉక్కు కర్మాగారం కోసం భూములు ఇచ్చిన రైతులను కూడా పరిగణలోకి తీసుకోవాలని నేను కోర్టు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.అలాగే అక్కడి ఉద్యోగులు షేర్ హోల్డర్స్ కాకూడదని యజమనులు భాగస్వాములు కావాలని అన్నారు. తాను కోర్టులో న్యాయ పోరాటం చేసిన అన్ని కేసుల్లో విజయం సాధించానని గుర్తు చేశారు. అందుకే ఈ స్టీల్ ప్లాంట్ పిటీషన్ పై కూడా విజయం సాధిస్తానని పాల్ ధీమా వ్యక్తంచేశారు. 3 లక్షల కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్ ను కేవలం 3 వేల కొట్ల రూపాయలకు అమ్మాలని చూస్తుండడం దారుణమన్నారు.58 మంది మిలినియర్ ఫ్రెండ్స్ తో ప్రవేటీకరణ కాకుండా అడ్డుకుంటానని తెలిపారు. ఇస్టానుసారంగా గంగవరం పోర్టును కూడా అమ్మేశారని ఆరోపించిన పాల్ ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వలేదని.. ఏపీలో ఉన్న ఆస్తులను ప్రవేట్ పరం చేశారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ కాకుండా ప్రాణ త్యాగం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు. 4 వేల కోట్ల రూపాయలు తెచ్చి స్టీల్ ప్లాంట్ కోసం నెల రోజుల్లో డొనేషన్ ఇస్తానని స్టీల్ ప్లాంట్ అప్పుల్లో ఉంటే ఆ అప్పులన్నీ తీర్చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా  సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు స్టీల్ ప్లాంట్ కొంటామని బిడ్ వేస్తామని సీఎం కేసీఆర్ పొలిటికల్ డ్రామా ఆడారు అంటూ ఆరోపించారు.

 

 

Post Midle

స్టీల్ ప్లాంట్ విషయం కేసీఆర్ పొలిటికల్ స్టంట్ చేసిన వినోదం చూశారు అంటూ ఎద్దేవా చేశారు.మరోవైపు పవన్ పై సెటైర్లు వేస్తూనే.. ఆయనకు ఆఫర్ ఇచ్చారు. తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్నారంటూ పాల్ పవన్ పై సెటైర్లు వేశారు. పవన్ ఎలాగూ గెలవలేవని.. తనతో వచ్చి పోరాటం చేయాలని పిలుపు ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తాను పోరాడుతున్నానని.. తన పోరాటంలో పవన్ కూడా భాగస్వామయ్యం కావాలని కోరారు. ఇప్పటికే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ,గద్దర్ నాతో కలిసి వచ్చారని వారిలాగా పవన్ కూడా వచ్చి తనతో చేయి కలుపాలని కోరారు. అందరం కలిసి విశాఖ ఉక్కు కోసం కలిసి పోరాటం చేద్దాం…రా తమ్ముడు అంటూ పిలుపునిచ్చారు.నాకు పర్మిషన్ ఇస్తే నాకున్న ఆస్తులు అమ్మి స్టీల్ ప్లాంట్‌కు కడతానని అన్నారు. జేడీ లక్ష్మీనారాయణను పార్టీలోకి ఆహ్వానించామని.. సానుకూలంగా స్పందించినట్లు కేఏ పాల్ తెలిపారు. గ్రామస్థాయిలో కమిటీలు వేస్తున్నామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ముప్పై లక్షల మంది కమిటీ సభ్యులు ఉన్నారన్నారు.

 

Tags: What is the KA Paul link?

Post Midle