ఎం హెచ్ ఓ వెంకటరమణ పై చర్యలు చేపట్టకపోవడం పై ఆంతర్యమేంటి  అఖిలభారత ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల ఐక్య వేదిక డిమాండ్

నెల్లూరు  ముచ్చట్లు :
నెల్లూరు నగర పాలక శాఖ వెంకటరమణ పై గత 2 వారాలుగా వస్తున్న ఆరోపణలు అభియోగాలపై నగరపాలక శాఖ కమిషనర్ దినేష్ కుమార్ ఎందుకు చర్యలు చేపట్టకపోవడం లేదని, అఖిలభారత షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, బలహీనవర్గాల మరియు అల్పసంఖ్యాక వర్గాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం కమిషనర్ దినేష్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ నుండి తన దిగువ స్థాయి ఉద్యోగులైన శానిటరీ  ఇన్స్పెక్టర్లు మేస్త్రీలు, సచివాలయ శానిటేషన్ కార్యదర్శుల సిబ్బందిని మానసికంగా, మనోవేదనకు గురిచేసిన వెంకటరమణ పై శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడం పై ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. నీచంగా మాట్లాడటమే కాకుండా  గంటలతరబడి మోకాళ్ళ మీద నిలబెట్టి ,మానసిక వేధింపులకు గురి చేసిన వెంకటరమణ ఎందుకు ఉపేక్షిస్తున్నారని ఆవేదన చెందారు. వెంకటరమణ 8 సంవత్సరాల డెప్యుటేషన్పై నగరపాలక శాఖ కార్యాలయానికి వచ్చి , పాతుకుపోయి తన క్రింది స్థాయి ఉద్యోగులను కులాల పేరుతో  పిలుస్తూ, అవహేళనగా మాట్లాడడం మానవత్వం కాదన్నారు. మహిళా సిబ్బందిని సైతం అమర్యాద పదజాలంతో పిలవడమే కాకుండా, లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి అని ఆరోపించారు. తనకు అనుకూలంగా లేని మహిళలను విధుల రీత్యా  పలు ఇబ్బందులకు గురిచేసినట్లు విమర్శలు ఉన్నాయన్నారు. హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ వ్యవహార శైలి ప్రవర్తన కారణంగా అనేకమార్లు సస్పెండ్ అయ్యారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. డిప్యుటేషన్పై నగరపాలక శాఖలో పనిచేస్తున్న వెంకటరమణ పై అనేక ఆరోపణలు, విమర్శలు వస్తున్నప్పటికీ, అనేకమార్లు సస్పెండ్కు గురైన అప్పటికీ అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంకటరమణ పై చర్యలు తీసుకోకపోతే, ఈ విషయమై సంబంధిత మంత్రివర్యులకు ఫిర్యాదు చేయవలసి ఉంటుందని హెచ్చరించారు. అధికారుల చర్యలు అనుసరించి త్వరలో అఖిలభారత షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్ తెగల, బలహీనవర్గాల బలహీనవర్గాల మరియు  అల్పసంఖ్యాక వర్గాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగర పాలక శాఖ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపడతామన్నార

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags:What is the motive behind not taking action against MHO Venkataramana?
All India SC ST Demand for a united platform of weaker sections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *