Natyam ad

రేషన్ కు దోషం ?      

సాంకేతిక లోపం అంటూ ప్రచారం
పండుగ దగ్గర పడుతున్న అందరి  బియ్యం
10 తేదీ వచ్చిన షాపులు చేరని సరుకు
అసలు కారణం చెప్పని అధికారులు
ఆందోళనలో నిరుపేద లబ్ధిదారులు

 

నాగర్ కర్నూల్ ముచ్చట్లు :

 

Post Midle

కేంద్రం నుండి ఉచితంగా ఇచ్చి ఐదు కిలోల బియ్యం రేషన్ దుకాణాలకు చేరాయి. మరి రాష్ట్ర నుండి ఇచ్చే బియ్యం. రేషన్ షాపులకు రాలేదు. సాకేతిక లోపమని సాకులు చెబుతున్నారా ? లేక కిలో బియ్యం కు రూపాయి వసూలు చేసే పనిలో ఉన్నారా? కనీసం కేంద్రం ఇచ్చిన ఉచిత ఐదు కిలోల బియ్యం అయినా పంపిణీ  చేయమని వినియోగదారులు గోడు వెల్లబోసుకుంటున్నారు. తెలంగాణలో అమలయ్యే సంక్షేమ పథకాలలో రూపాయి కిలో బియ్యం పథకం ఒకటి. ఇప్పుడు ఆ పథకం నీరు గారి పోతుంది.1982లో నందమూరి తారక రామారావు పేదోడి కూడు గూడు గుడ్డ అందించాలని ఉద్దేశంతో కిలో బియ్యం రెండు రూపాయలకు ఇచ్చారు. రేషన్ దుకాణాల ద్వారా వివిధ సరుకులు ఇచ్చారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేషన్ దుకాణాల ద్వారా ప్రతినెల తెల్ల రేషన్ కార్డు దారుడికి 9 రకాల నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు.2014లో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ నేటి బి ఆర్ ఎస్ కిలో బియ్యం రేషన్ దుకాణాల ద్వారా రూపాయికి ఇస్తుంది ఒక బియ్యం మాత్రమే ఇచ్చి మిగిలిన 8 సరుకులు మంగళం పాడింది.2020-21 లో దేశవ్యాప్తంగా కరోనా విలయతాండగా చేయడంతో ప్రజలు ఎవరు బయటకి రాలేనీ  పరిస్థితి ఏర్పడింది. పూట గడవడం కష్టంగా మారింది. కేంద్ర ప్రజల జీవన విధానం అర్థం చేసుకొని రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నెలకు 5 కిలోల ఉచిత బియ్యము ప్రకటించింది.

 

 

 

మేము ఏమైనా తక్కువ అని రాష్ట్ర మరో ఐదు కిలోల బియ్యం ఉచితంగా ప్రకటన చేసింది. ప్రతినెల 5వ తేదీ నుండి రేషన్ దుకాణాల ద్వారా కేంద్రం ఇచ్చిన ఐదు కిలోల. రాష్ట్రం ఇచ్చిన ఐదు కిలోలు మొత్తం ఒక్కొక్కరికి 10 కిలోలు ఉచిత బియ్యం పంపిణీ చేసేవారు . జనవరి 10వ తేదీ వచ్చిన కేంద్రం 5 కిలోల బియ్యం రేషన్ దుకాణాలకు ఉచితంగా పంపిణీ చేసినప్పటికీ. రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యాన్ని విడుదల చేయలేదు. ఎందుకు బియ్యం సరఫరా చేయలేదని
ప్రశ్నిస్తే మిషన్స్ సాంకేతిక లోపం అని సమాధానం చెబుతున్నారట! ఏది ఏ బైనప్పటికీ సంక్రాంతి పండుగ సవీపిస్తున్న తరుణంలో కేంద్రం ఇచ్చిన ఐదు కిలోల బియ్యం అయినా త్వరిత్వరనా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 

Tags: What is wrong with rationing?

Post Midle