Natyam ad

ఎవడండీ ఘంటా..? లక్షల్లో వాడొక్కడు..: మాజీ మంత్రి అయ్యన్న

అమరావతి ముచ్చట్లు:


‘ఎవడండీ ఘంటా..? లక్షల్లో వాడొక్కడు.. లక్షల్లో నేనొక్కడిని. ఘంటా ఏమైనా పెద్ద నాయకుడా..? ప్రధానా..? పార్టీలో అందరూ రావాలి…పని చేయాలి. కష్టకాలంలో కూడా పార్టీ కోసం పని చేయాలనేదే మా కోరిక’ అని మాజీ మంత్రి ఘంటాపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు చేశారు. తామెవ్వరికీ వ్యతిరేకులం కాదన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని.. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ వస్తున్నారని విమర్శించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండని వారిని చూస్తేనే తమకు బాధేస్తుందన్నారు. తమకు అందరూ కావాలని అయ్యన్న పేర్కొన్నారు.ఇంకా అయ్యన్న మాట్లాడుతూ.. ‘‘పార్టీ కష్టకాలంలో దూరంగా ఉన్నవాళ్లు కూడా బాగుండాలనే కోరుకుంటాం. టీడీపీకి మొదట్నుంచి బడుగులే అండగా ఉన్నారు. టీడీపీ బీసీలకే పెద్ద పీట వేసింది. పార్టీ అధికారంలో ఉన్నా..

 

 

లేకున్నా బీసీలు టీడీపీకి అండగానే ఉన్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీ.. హార్డ్ వేర్ కంపెనీలే కాదు.. అండర్ వేర్ కంపెనీలు కూడా పోతున్నాయి. జాకీ అండర్ వేర్ కంపెనీని కేటీఆర్ పట్టుకుపోయారు. రాజధాని లేని దిక్కుమాలిన రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. భారతీ సిమెంట్స్ ధర మిగిలిన వాటికంటే రూ. 20 ఎక్కువ. సీఎం జగన్ ముద్దుల భార్య కంపెనీ అనేనా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. త్వరలో టీడీపీ బీసీ నేతల సమావేశం. మూడు ప్రాంతాల్లో బీసీ సదస్సులు పెడతాం. బ్రాందీ షాపులను 25 ఏళ్ల తనఖా పెట్టి.. రూ. 8700 కోట్లు అప్పు తెస్తారా..? బ్రాందీ షాపులను తనఖా పెట్టిన దౌర్బాగ్యుడని తెలియక ప్రజలు ఓటేశారు’’ అని పేర్కొన్నారు.

 

Post Midle

Tags: What time is it? One in a million..: Former Minister Ayanna

Post Midle