ఏం చేస్తున్నావు మూవీ మోష‌న్ పోస్ట‌ర్ కి అనూహ్య స్పంద‌న‌

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ఎన్ వీ ఆర్ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకం పై శ్రీమ‌తి కురువా ల‌క్ష్మీ స‌మ‌ర్ప‌ణ‌లో న‌వీన్ కురువా, కిర‌ణ్ కురువా నిర్మాత‌లుగా నూత‌న తార‌లు విజయ్ రాజ్, నేహా ప‌త‌న్, అమితా రంగ‌నాథ‌ల‌తో నూత‌న ద‌ర్శ‌కులు భ‌ర‌త్ మిత్ర తెర‌కెక్కిస్తున్న చిత్రం ఏం చేస్తున్నావు. నేటి యువ త‌రంతో పాటు తెలుగునాట‌ అత్య‌ధికంగా వాడే ప‌దాన్నే ఈ సినిమాకు టైటిల్ గా పెట్ట‌డంతో ప్ర‌స్తుతం ఏం చేస్తున్నావు చిత్రం పై అంత‌టా ఆస‌క్తి నెల‌కొంది. న్యూఏజ్ ల‌వ్ స్టోరీతో రెడీ అవుతున్న ఈ చిత్రానికి హ్యాపెనింగ్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీసుంద‌ర్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గోపీ సుంద‌ర్ శైలిలోనే  అద్భుత‌మైన మ్యూజిక్ తో ఏం చేస్తున్నావు టైటిల్ ఎనౌన్స్ మెంట్ మోష‌న్ పోస్టర్ విడుద‌లై సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఏం చేస్తున్నావు టైటిల్ తో పాటే మోష‌న్ పోస్టర్ కి కూడా అద్భుత‌మైన స్పంద‌న ల‌భించ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని దర్శ‌క నిర్మాత‌లు అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్న వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవుతాయి
తారాగ‌ణం – విజ‌య్ రాజ్, నేహా ప‌తన్, అమితా రంగ‌నాథ‌

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: What we are doing is an unexpected response to the movie motion poster

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *