తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుంది

హైదరాబాద్ ముచ్చట్లు:

మునుగోడు ఉపఎన్నిక.. కాంగ్రెస్‌లో అంతర్గత పోరు హీట్‌ మీద ఉన్న సమయంలో పార్టీ హైకమాండ్‌ ఇద్దరు కాంగ్రెస్ కార్యదర్శులను రాష్ట్రానికి పంపింది. గతంలో ఇక్కడ పనిచేసిన కాంగ్రెస్ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్‌ వెళ్లిపోవడంతో.. ఆయన ప్లేస్‌లో ఇద్దరు వచ్చారు. కొత్తగా నదీం జావెద్‌.. రోహిత్‌ చౌదరిలను ఎంపిక చేసి.. తెలంగాణకు పంపడం వెనక పార్టీ పరంగా పెద్ద వ్యూహమే ఉందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.నదీం.. రోహిత్‌ ఇద్దరూ గతంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీతో కలిసి పనిచేశారు. ప్రియాంక కోటరీలో నమ్మకస్తులుగా ముద్ర ఉంది. సమన్వయ కర్తలుగా సమర్థంగా పనిచేస్తారని రాహుల్‌ గాంధీకి కూడా గురి ఉందట. వీరిద్దరికీ ప్రియాంక, రాహుల్‌ గాంధీలు 45 రోజులు గడువు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు అగ్రనేతలు స్వయంగా ఎంట్రీ ఇచ్చి.. కాంగ్రెస్ కార్యదర్శులను హైదరాబాద్‌లో ల్యాండ్‌ చేయించారని టాక్‌.తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుంది? ఎవరు చెప్పేది నిజం? గ్రౌండ్‌లో పరిస్థితి ఏంటి? అనే అంశాలపై ఇద్దరు కాంగ్రెస్ కార్యదర్శులు నదీం.. రోహిత్‌లు హైకమాండ్‌కు నివేదికలు ఇస్తారని సమాచారం. ఈ విషయంలో ప్రియాంకా గాంధీ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారట. నియోజకవర్గాల వారీగా బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు నేతలు.. పని కూడా మొదలుపెట్టేశారు. PJR కుమారుడు,

 

 

 

మాజీ ఎమ్మెల్యే విష్ణుతో నదీంజావెద్‌ భేటీ అయ్యారు. కొద్దిరోజులుగా విష్ణు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆపై పార్టీ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీతోనూ నదీం జావెద్‌ సమావేశం అయ్యారు. పార్టీ వ్యవహారాలు.. అంతర్గత అంశాలు.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ పనితీరుపై నదీం ఆరా తీస్తున్నారట.మరో కాంగ్రెస్ కార్యదర్శి రోహిత్ చౌదరి సైతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని ఆకళింపు చేసుసుకునే పనిలో పడ్డారు. త్వరలోనే ఫీల్డ్‌ ఎంట్రీ ఇస్తారట. దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉంది హైకమాండ్‌ భావిస్తోంది. అందుకే ఇక్కడి వ్యవహారాలను ప్రియాంకా గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తారని చర్చ జరుగుతోంది. అందుకే ఆమె టీమ్‌లో కీలకంగా ఉన్న ఇద్దరిని తెలంగాణ పంపినట్టు చర్చ సాగుతోంది.రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితితోపాటు.. పార్టీ నేతల్లో ఎవరేంటి? వివాదాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీ ఎందుకు పుంజుకోలేదు? 2014, 2018 ఎన్నికల ఫలితాలు..

 

 

2018 తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ పనితీరు. పీసీసీకి కొత్త సారథ్యం వచ్చాక జరిగిన కార్యక్రమాలు.. నేతల అలకలు.. అసంతృప్తులు.. ఆరోపణలు.. విమర్శలపైనా ఫోకస్‌ పెడతారని తెలుస్తోంది. అసలు కాంగ్రెస్‌లో ఈ పంచాయితీలు ఏంటి? వీటి వెనక ఎవరు ఉన్నారు? ఇలా అన్ని అంశాలను 45 రోజుల్లో వడపోసి.. పూర్తి స్థాయి అధ్యయనం నివేదికను హైకమాండ్‌కు అందజేస్తారట. అందుకే తెలంగాణ కాంగ్రెస్‌లో రానున్న 45 రోజులు అందరిపైనా ఫోకస్‌ ఉంటుందని.. అందరి జాతకాలు ప్రియాంకా గాంధీ దూతల చేతికి చిక్కినట్టేనని లెక్కలేస్తున్నారు. మరి.. అధిష్ఠానం చేపట్టిన ఈ చికిత్స పార్టీకి ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాలి.

 

Tags: What will happen in Telangana Congress?

Leave A Reply

Your email address will not be published.