Natyam ad

మంచిని విమర్శించడమేవారి పనా?     ప్రతిపక్షాలపై సీఎం జగన్‌ ఆగ్రహం

గుంటూరు  ముచ్చట్లు:
 
మంచి చేస్తా ఉంటే మంచిని విమర్శించేవారు ఉన్నారని మంచిని విమర్శించడమేవారి పనా? అని ప్రతిపక్షాలపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే అడ్డుకున్నారని చెప్పారు. పేదల కోసం సినిమా టికెట్ల ధరలను నియంత్రిస్తే దీనిపై కూడా విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలకు మంచి జరగకూడదని దురుద్దేశంతోనే అడ్డుకుంటున్నారని అన్నారు. వీరంతా పేదలకు శత్రువులు కాదా? అని సీఎం ప్రశ్నించారు. రాజకీయ స్వార్థంతో ప్రతిదానికి అడ్డుపడుతున్నారుని పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచైనా వీరికి మంచి జ్ఞానం కలగాలని కోరుకుంటున్నానని చెప్పారు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: What’s the point of criticizing the good? CM Jagan angry over opposition