కల్తీల పర్వానికి అడ్డుపడేదెన్నడు?

What's wrong with the cows?

What's wrong with the cows?

Date:10/09/2018
మంచిర్యాల ముచ్చట్లు:
మంచిర్యాల జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని సంతల్లో కల్తీ సరకులు దర్శనమిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్ లో కల్తీ నిత్యావసరాలను పలువురు యథేచ్ఛగా విక్రయించేస్తున్నారని మండిపడుతున్నారు. తనిఖీలు చేయాల్సిన అధికారులు ఉదాసీనంగా ఉంటుండడంతో ఈ దందా కొనసాగిపోతోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి సరకులు వినియోగిస్తున్నవారు అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మంచిర్యాలలో ఏజెన్సీ ప్రాంతాలు అధికం. ఇక్కడి గిరిజనులు పౌష్టికాహార లోపంతో సతమతమవుతుంటారు. ఇలాంటి వారికి కల్తీ ఆహారం జతకలవడం మరిన్ని సమస్యలకు తావిస్తుందని అంతా అంటున్నారు. కూలి పనులు చేసి, సంపాదించిన అరకొర డబ్బులు సైతం వైద్యానికే ఖర్చు పెడుతున్న దయనీయ దుస్థితి ఏజెన్సీ గ్రామాల్లో ఉందని చెప్తున్నారు. తనిఖీ అధికారుల కొరత, ఉన్న సిబ్బంది కార్యాలయాలకు, కాసులకు మాత్రమే పరిమితం కావడం వల్ల ఆహార పదార్థాలను కల్తీ చేసే అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. జిల్లాలో ఉన్న ఆహార తనిఖీ అధికారులు ఒక్కొక్కరు నెలకు 12 చొప్పున ఏడాదికి 144 ఆహార నమూనాలను సేకరించాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత నెలలో వివిధ ప్రాంతాల్లో ఏడు నమూనాలను మాత్రమే సేకరించారు. తనిఖీ పనులు, శాంపిల్స్ సేకరణ నామమాత్రంగా సాగుతుండడంతో కల్తీ రాయుళ్లు చెలరేగిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.మారుమూల గిరిజన గ్రామాలకు చెందిన ప్రజలు సమీప మండల కేంద్రాల్లో నిర్వహించే సంతల్లో నిత్యావసర సరకులు, తినుబండారాలు తీసుకెళ్తుంటారు. గిరిజనుల అమాయకత్వమే ఆసరాగా వ్యాపారులు నకిలీ, నాసిరకం వస్తువులను విక్రయిస్తుంటారు. అనేక కిరాణా దుకాణాల్లో అమ్మడంతో పాటు, గోడౌన్లలో నకిలీ సరకులు నిల్వ చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. మంచిర్యాలలోనే కాక ఈ సమస్య ఉమ్మడి జిల్లాలోనూ ఉంది. ఉమ్మడి జిల్లాలో కల్తీ ఆహార నియంత్రణ శాఖలో మంచిర్యాల, కుమురం భీం జిల్లాలకు ఒక్కరు, ఆదిలాబాద్‌కు ఒక్కరు మాత్రమే ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉన్నారు. మరోవైపు నిర్మల్‌ జిల్లాకు ఉద్యోగి లేకపోవడం సమస్యాత్మకంగా మారింది. మొత్తంగా సిబ్బంది కొరత ఉమ్మడి జిల్లాలో కల్తీని కట్టడి చేయలేకపోతోంది. కల్తీ దందాపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇక నిర్దేశిత లక్ష్యం ప్రకారం సేకరించాల్సిన నమూనాలు, తనిఖీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సక్రమంగా సాగడంలేదు. ప్రధానంగా ఏజెన్సీలో తనిఖీలు సరిగా సాగడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి ఆహార పదార్ధాల కల్తీకి అడ్డుకట్ట వేయాలని ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేయాలని అంతా కోరుతున్నారు.
Tags:What’s wrong with the cows?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *