వాట్సాప్ సంచలన నిర్ణయం..!
ఆంజనేయులు న్యూస్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రూపులో ఫార్వర్డ్ మెసేజ్ లని ఒకసారి మాత్రమే ఫార్వర్డ్ చేసుకునేలా కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ మేరకు వాబీటాఇన్ఫో తన వెబ్సైట్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ వెర్షన్ 22.2.7.2, ఐఫోన్ 22.7.0.76 వెర్షన్ లో ఈ కొత్త నిబంధన అమల్లోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది. వాబీటాఇన్ఫో తెలిపిన వివరాల ప్రకారం.. ఒక మెసేజ్ ను ఒకటి కంటే ఎక్కువ గ్రూపుల్లో ఇక ఫార్వర్డ్ చేయడం కుదరదు. ఒకవేళ ఫార్వర్డ్ చేయాలనుకుంటే తిరిగి మెసేజ్ ని ఎంచుకుని ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. కాగా.. సింగిల్ గ్రూప్ ఫార్వర్డ్ లిమిటేషన్ ఇప్పటికే కొన్ని ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ లో ప్రవేశపెట్టినట్లు వాబీటాఇన్ఫో పేర్కొంది. అయితే, ఈ నిబంధనలను మరికొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్లలోనూ పరీక్షిస్తున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే ఇంకొన్ని రోజుల్లో అన్ని స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ మెసేజ్లను ఒకటి కంటే ఎక్కువ గ్రూపులకు ఫార్వర్డ్ చేసే వీలు ఉండకపోవచ్చు. ఇదిలా ఉండగా.. 2018 జులైలో ఫేస్బుక్ మెసేంజర్ భారత్ లో ఈ నిబంధనను తొలిసారి ప్రవేశపెట్టింది. యూజర్లు గరిష్ఠంగా ఐదు వేర్వేరు చాట్లకు ఒకసారి మాత్రమే మెసేజ్ ఫార్వర్డ్ చేసుకునేలా పరిమితిని విధించిన విషయం తెలిసిందే.