వాట్సప్ వాయిస్ కమాండ్ ఫీచర్

Whatsapp voice command feature

Whatsapp voice command feature

Date:06/10/2018
ముంబై ముచ్చట్లు:
ఇతర మెసేజింగ్‌ యాప్‌లతో పోలిస్తే ప్రత్యేకంగా ఉండాలనే ఆలోచనతోనే కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతున్నట్లు సంస్థ తెలిపింది.ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఫేస్‌బుక్’ తన మెసెంజర్ యాప్‌లో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ‘వాయిస్‌ కమాండ్‌’ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
ప్రస్తుతం అంతర్గత పరిశీలనలో ఉంది. ఈ ఫీచర్‌ ద్వారా.. మాటలను టెక్ట్స్‌ రూపంలోకి మార్చవచ్చు. అంతేకాకుండా ఫోన్‌ను తాకకుండానే ఆ మెసేజ్‌ను ఇతరులకు పంపే వెసులుబాటు కూడా ఉండనుంది.
ప్రపంచవ్యాప్తంగా నెలకు సుమారు 130 కోట్ల మంది మెసెంజర్‌ యాప్‌ను వాడుతున్నారు. వారి సౌలభ్యం కోసం యాప్‌ నుంచి చేసే కాల్స్‌ను నియంత్రించే వెసులుబాటు, రిమైండర్లు క్రియేట్‌ చేసుకునే సౌకర్యం కొత్త ఫీచర్‌లో చేర్చుతున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించింది. ఇతర మెసేజింగ్‌ యాప్‌లతో పోలిస్తే ప్రత్యేకంగా ఉండాలనే ఆలోచనతోనే కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతున్నట్లు సంస్థ తెలిపింది.
Tags:Whatsapp voice command feature

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *