When Corona victim returns home

కరోనా బాధితుడు కోలుకుని ఇంటికి చేరిన వేళ…

– జిల్లా కలెక్టర్‌, డాక్టర్‌గా చేపట్టిన చర్యలు విజయవంతం
– అధికారుల సేవలకు ప్రశంసలు
– మనోధైర్యం నింపిన అధికారులు

Date:09/04/2020

తిరుపతిముచ్చట్లు:

కరోనా వైరస్‌తో బాధపడిన తొలి బాధితుడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన హేమస్వరూప్‌. ఈ సంఘటనతో జిల్లా ప్రజలు , అధికారులు తీవ్ర ఆందోళనకు లోనైయ్యారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మదుసూదనరెడ్డి, జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తాతో పాటు వైద్యాధికారులు చికిత్సలు చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా డాక్టర్‌ కావడంతో ఆయన డాక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి, కరోనా కట్టడికి పకడ్భంధిగా వైద్యసేవలు అందించారు. చికిత్సలు విజయవంతమై రుయా ఆసుపత్రి నుంచి బాధితుడు హేమస్వరూప్‌ ఆరోగ్యవంతుడుగా ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ వైద్యులు ఎంతో నాణ్యమైన సేవలు అందించారని కొనియాడారు. ఈ సంగటనతో జిల్లా ప్రజల్లో అధికారుల చర్యలు మనోధైర్యాన్ని నింపింది. కరోనా వ్యాదిని కూడ నివారించగ లమన్న ధీమా వైద్యుల్లో ఏర్పడింది. ఈ విషయమై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

93 మందికి కరోనా నెగిటివ్

Tags: When Corona victim returns home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *