చక్కెర ఫ్యాక్టరీ ఎప్పుడు తెరుస్తారు?

-టిపిసిసి నాయకులు జువ్వాడి కృష్ణారావు

జగిత్యాల ముచ్చట్లు :

ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోనే ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలం ముత్యంపేటలో ఉన్న నిజాం చక్కర ఫ్యాక్టరీని ఎప్పుడు తెరుస్తారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువ్వాడి కృష్ణారావు సూటిగా ప్రశ్నించారు.బుధవారం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూజిల్లా లోని రైతుల కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రభుత్వరంగం లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని ముందుగా 1,250 మెట్రిక్ టన్నుల క్రషింగ్ కెపాసిటీతో కర్మాగారాన్ని ఏర్పాటు చేయగా ఈ ప్రాంత రైతు లు అధికంగా చెరుకు పండించారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత రైతులకు మరింత లబ్ది చేకూరాలనే ఉద్దేశ్యం తో 2,500 మెట్రిక్ టన్నులకు క్రషింగ్ కెపాసిటీ కి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిందని కృష్ణారావు గుర్తు చేశారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం ఫ్యాక్టరీని దివాళా తీయించారని అలాగే ప్రైవేటేజేషన్ చేశారని ఆయన ఆన్నారు.

 

 

 

ఆ విధంగా కొద్దీ కాలం ఫ్యాక్టరీ ప్రయివేట్ రంగం లో నడిచిన దని అసమయంలో మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్రం వస్తే వంద రోజులలో ఫ్యాక్టరీ ని పూర్తిగా ప్రభుత్వపరం చేసుకుని నూరు %  ప్రభుత్వమే ఫ్యాక్టరీని నడిపిస్తాం అని హామీ ఇచ్చారని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి అప్పటి వరకు కనీసం ప్రభుత్వ ప్రయివేట్ ఉమ్మడి బాగస్వామ్యంలో నడుస్తున్న చక్కర ఫ్యాక్టరీ పూర్తిగా మూసివేశారని ఆయన అన్నారు. ఫ్యాక్టరీ తెరుస్తామని హామీ ఇచ్చి ఏడు సంవత్సరాలు గడిచిన కర్మాగారం తెరవ లేదని అన్నారు. ఫ్యాక్టరీ క్వర్టర్లలో నివాసం ఉంటున్న కార్మికులకు కరెంట్ కూడా కట్ చేయించారని కార్మికుల పట్ల రైతుల పట్ల రాక్షసంగా ప్రవర్తించారని

 

 

అలాగే ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ప్రభుత్వరంగంలో ఫ్యాక్టరీని తెరిపిస్తామని లేని పక్షంలో తన స్వంత నిధులతో ప్రయివేట్ రంగం లో ప్రారంభిస్తానని హామీ ఇచ్చారని కానీ నేటికీ రెండు సంవత్సరాలు అయినా ఫ్యాక్టరీ ఊసే ఎత్తడం లేదని కృష్ణారావు విమర్శించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అయితే ఫ్యాక్టరీ కనుక తెరిపించక పోతే ఫ్యాక్టరీ గెట్ వద్దనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని అన్నారని, ఈ నాయకులు అందరు కూడా ప్రజలను, రైతులను మోసం చేశారని వీరికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని మూసి వేయించిన కర్మాగారాన్ని వెంటనే తెరిపించాలని జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేశారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: When does the sugar factory open?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *