Natyam ad

పెళ్లికి వెళ్లి వచ్చే సరికి…

ఏలూరు ముచ్చట్లు:

దొంగలు మాయ చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దొంగలు ఓ ఇంట్లో పడి దోచేశారు. ఎప్పుడూ ఇంట్లో ఎవరో ఒకరు ఉండే ఆ ఇంట్లో ఒక్కరోజు శుభకార్యానికి వెళ్లిన భాగ్యానికి 60కాసుల బంగారం దొంగలు కాజేశారు. పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఏడవ వార్డులోని పిఎన్టీ కాలనీలో 60 కాసులు బంగారం 4.50 కేజీలు వెండి చాకచక్యంగా దొంగలు ఎత్తుకెళ్లారు. తాడేపల్లిగూడెం వాస్తవ్యుడైన పెనుమత్స రామచంద్ర రాజు తన బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో ఉదయమే బ్యాంకు లాకర్ నుండి బంగారం తీసుకువచ్చి ఊరు వెళ్లే క్రమంలో అవసరమయ్యే బంగారం ధరించుకుని మిగిలిన బంగారం ఇంట్లో ఉంచి శుభకార్యానికి హాజరయ్యారు.

 

 

కుటుంబం అంతా హాజరవడంతో రాత్రి ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో ఇంట్లో బంగారంతో పాటు, ఇంట్లో పూజలకు వాడే వెండితో సహా మొత్తం బంగారాన్ని, వెండిని కాజేశారు. విషయం తెలుసుకుని తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు తమదైన శైలిలో దొంగను పట్టే పనిలో పడ్డారు. క్లూస్ టీం వచ్చి తగిన ఆధారాలు సేకరించే క్రమంలో ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ క్లూస్ టీం ఆధారంగా కేసును పరిశీలిస్తున్నామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా క్రైమ్ బ్రాంచ్ సీఐ రఘు,తాడేపల్లిగూడెం సీఐ నాగరాజులు సంఘటన జరిగిన ఇంటికి వచ్చి పరిశీలించారు. త్వరలో కేసుని శోధించి దొంగలను పట్టుకొంటామని పోలీసులు తెలిపారు. ఇంటికి తాళం వేసి వెళ్ళేవారు జాగ్రత్తగా వుండాలని పోలీసులు సూచించారు.

 

Post Midle

Tags: When going to the wedding…

Post Midle