ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేతికి అసలు గన్ ఇస్తే…  

When the Energy Star Ram Gives The Original Gun ...

When the Energy Star Ram Gives The Original Gun ...

Date:23/12/2019

వెండితెర మీద డమ్మీ గన్ లతో ప్రత్యర్థుల మీదికి విరుచుకుపడే హీరోకి అసలైన గన్ లు చేతికి వస్తే ఎలా ఉంటుంది. అలాంటి  అవకాశం మన ఇస్మార్ట్ శంకర్, టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి వచ్చింది. రక్షణ దళాలు, పారామిలిటరీ దళాలు,  వివిధ పోలీసు శాఖలకు గత 25 ఏళ్లుగా తుపాకులు, ఏకే 47 లాంటి ఆయుధాలను రూపొందించి సరఫరా చేసే జెన్ టెక్నాలజీస్ సంస్థ హైదరాబాద్ లో  నిర్వహించిన రజతోత్సవ కార్యక్రమానికి రామ్  ని  ముఖ్య అతిథిగా  ఆహ్వానించింది. అలాంటి అవకాశం వస్తే ఈ ఎనర్జిటిక్ స్టార్ ఎలా ఊరుకుంటారు. గన్ చేతికి తీసుకుని ఎలా కాలిస్తే టార్గెట్ రీచ్  అవుతుందో తెలుసుకున్నారు. తన సినిమాలకు బాగా పనికి వస్తుందనుకుని ఆయుధాలకు సంబంధించిన సమాచారమంతా  అడిగిమరీ తెలుసుకున్నారు. ఎంఎంజీ, ఏజీఎల్, ఏటీజీఎమ్, సీటీఎస్ఆర్, ఏకే 47… ఇలా అన్ని రకాల ఆయుధాల సమాచారం  తెలుసుకోవడమే కాకుండా , చేతుల్లోకి తీసుకుని ప్రయోగాలు కూడా మొదలు పెట్టేశారు. షూటింగ్ రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యక్ష  ప్రయోగం కూడా చేశారు. ఈ అనుభవం గురించి రామ్ మాట్లాడుతూ ‘అరుదైన అనుభవమిది… సినిమా లాగా లేదు. చాలా కొత్తగానూ, థ్రిల్లింగ్ గానూ ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ సంస్థవారికి థాంక్స్ చెప్పాలి అన్నారు. ఈ  సంస్థ ఎండీ, ఛైర్మన్ అశోక్ అట్లూరి ఈ సందర్భంగా రామ్ ను జ్ఞాపికతో సత్కరించారు. సంస్థ ప్రెసిడెంట్ కిషోర్ దత్ అట్లూరి,  బిజినెస్ హెడ్ రవికుమార్ చెన్నా తదితరులు తమ కార్యక్రమానికి హాజరైనందుకు రామ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

 

ఇన్ సైడ్ ట్రేడింగ్ నిరూపిస్తే రాజీనామా

 

Tags:When the Energy Star Ram Gives The Original Gun …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *