టీపీసీసీ అధ్యక్షుడు ఎప్పటికి వచ్చెనూ..?

హైదరాబాద్ ముచ్చట్లు:

 

తెలంగాణ పీసీసీని కొలిక్కి తెచ్చే పనిలో ఉంది కాంగ్రెస్‌ అధిష్ఠానం. కొత్త పీసీసీ చీఫ్‌ ఎవరనేది ఇప్పటికే ఖారారైనట్లు చెబుతున్నారు. ఎంపీ రేవంత్‌ నూతన సారథిగా వస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌పార్టీలో సీనియర్ నాయకులంతా రచ్చ మొదలుపెట్టారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతామని AICC తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌కు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. దీంతో పార్టీలో ఏం జరుగుతుంది? ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి అని కొందరు విశ్లేషణలు చేస్తున్నారట.కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా కొందరు పార్టీ నాయకులు హైకమాండ్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. వాటిని చూసిన కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ.. అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని ఇంఛార్జ్ ఠాగూర్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పార్టీ నాయకులతో ఠాగూర్‌ మాట్లాడినట్టు సమాచారం. మరికొందరితో మాట్లాడేందుకు ఇంఛార్జ్‌ ఇబ్బంది పడుతున్నారట.

 

 

 

 

అలాంటి వారితో AICC కార్యదర్శి బోసురాజు మాట్లాడుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికైతే వ్యవహారం ఫైనల్ స్టేజ్‌కు వచ్చింది. పార్టీ నిర్ణయాన్ని సాకుగా చూపించి .. నాయకులు ఎవరూ జంప్‌ చేయకుండా చూడాలని అధిష్ఠానం భావిస్తోందట.తన నిర్ణయానికి అధిష్ఠానంతో ఆమోదముద్ర వేయించుకునే పనిలో ఇంచార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ ఉన్నట్టు కాంగ్రెస్‌ సీనియర్లు నమ్ముతున్నారట. ఇదే అంశం మేడం దగ్గరకు కూడా వెళ్లినట్టు చెబుతున్నారు. ఈ అభిప్రాయంతో ఉన్న వాళ్లలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్‌ నేతలు వి హన్మంతరావు, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారట. పార్టీ నిర్ణయాన్ని కాదనలేక బయట పడని సీనియర్లు సైతం ఉన్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు.పీసీసీ నియామకంపై అధిష్ఠానం తీసుకునే నిర్ణయం తమకు అనుకూలంగా లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, కేఎల్‌ఆర్‌ లాంటి వాళ్లు పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది.

 

 

 

 

ఈ ప్రచారం తమ చెవిన పడగానే వాటిని కోమటిరెడ్డి, జగ్గారెడ్డి ఖండించారు. పార్టీ మారను.. అలాగే ఏ పదవీ అడగను అని ఇంఛార్జ్‌ ఠాగూర్‌కు చెప్పారట కోమటిరెడ్డి. ఇక ఎమ్మెల్యే జగ్గారెడ్డి మొదటి నుంచి రేవంత్‌ పేరును వ్యతిరేకిస్తున్నారు. అయితే పీసీసీ ప్రకటన వెలువడిన తర్వాత ఆయన వెంటనే ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. కాకపోతే పార్టీకి మాత్రం దూరంగా ఉంటారని తెలుస్తోంది. నియోజకవర్గం లక్ష్యంగా రాజకీయాలు మొదలుపెట్టాలని చూస్తున్నారట జగ్గారెడ్డి. ఇక మొదటి నుంచి ఫైర్‌ అవుతున్న హన్మంతరావు యాక్షన్‌ ప్లాన్‌ ఏంటన్నది చూడాలి. KLR లాంటి వాళ్లయితే పార్టీకి గుడ్‌బై చెప్పడానికి నిర్ణయం తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.తెలంగాణ పీసీసీ నియామకం ఎపిసోడ్‌ కూడా జనానికి, పార్టీ వర్గాలకు వినీ వినీ బోర్‌ కొడుతోంది. కొత్త కమిటీని ప్రకటించాక సీనియర్లు నూతన సారథికి సహకరిస్తారా? సీనియర్లను కాదని కొత్త చీఫ్‌కు పనిచేయడం సాధ్యమేనా అని ప్రశ్నించేవారు లేకపోలేదు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: When will the TPCC President come ..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *