దేశంలో ఎక్కడ ప్రవేశపెట్టిని పథకాలు ఆంద్రప్రదేశ్ లో అమలు చేస్తున్నాం

Where are we going to enter the country in Andhra Pradesh,

Where are we going to enter the country in Andhra Pradesh,

Date:13/10/2018

గంగవరం  ముచ్చట్లు:

మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కలిగించి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి. యన్ టి రామారావు గారు.

మహిళలను ఆర్థికంగా అభివృద్ధికి చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు.

ప్రతి పక్ష నాయకులకు మహిళా సంఘాలు సమాధానం చెప్పాలి.

బ్యాంక్ లకు 99 శాతం రుణాలు తిరిగి చెల్లిస్తున్నా మహిళా సంఘాలు.

మహిళా సంఘాలు రూ.13 వేల కోట్లు తో రుణమాఫీ.

సంఘాలు ఒక బలమైన శక్తిగా ఉన్నాయి.

బ్యాంక్ లో తీసుకున్న ప్రతి పైసా తిరిగి చెల్లించడం వల్ల సంఘాల పై బ్యాంకులు నమ్మకం కలిగింది.

8 లక్షల 54 వేల సంఘాల 86 లక్షల 4 వేల 304 సభ్యులకు పసుపు కుంకం క్రింద రూ.8.604.30 కోట్లు

– మంత్రి యన్.అమరనాథ్ రెడ్డి.

భారత దేశం లో ఎక్కడ ప్రవేశపెట్టిని పథకాలను ఒక్క ఆంద్రప్రదేశ్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి యన్.అమరనాథ్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం,బైరెడ్డిపల్లి, వి.కోట,పలమనేరు, పెద్ద పంజాని మండలాల కు చెందిన మహిళా సంఘాలు సభ్యులు, సంఘం మిత్రులు,వివోలు, సభ్యుల కు పసుపు ,కుంకుమ క్రింద రాయితీ పై అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశం లో మొట్టమొదట సారిగా మహిళలకు పురుసులతో సమానంగా ఆస్తిలో హక్కు కల్పించిన వ్యక్తి కీర్తిశేషులు నందమూరి తారకరామారావు గారని, ఆతరువాత మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చంద్రబాబు నాయుడు గారిదని తెలిపారు. భారత దేశంలో ఏ రాష్ట్రము లో ఆములు చేయని అనేక సంక్షేమ పథకాలను మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టి వాటిని పారదర్శకంగా ఆములు చేయడం జరుగుతుందని అన్నారు.

2014 సంవత్సరం ముందు ఎన్నికల ప్రసారంలో రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ (పసుపు,కుంకుమ) క్రింద ప్రతి సభ్యరాలకు రూ.10వేలు ఇస్తామన్న మాటప్రకరంగా ఇప్పటికే రూ.8 వేలు సభ్యుల బ్యాంక్ ఖాతాలకు జమచేయడం జరిగిందని ,మిగిలిన రూ.2 వేలు దసరా పండగ కానుకగా సభ్యుల ఖాతాలకు జమచేయడం జరుగుతుందని అన్నారు. సంఘంలో రుణాల తీసుకున్న సభ్యులకు మాత్రమే రూ.10 వేలు ఇస్తే సంఘాల లో కలహాలు వస్తాయన్న ఆలోచనతో ముఖ్యమంత్రి సంఘంలో ఉన్న ప్రతి సభ్యురాలకు రూ.10 వేలు అందజేయాలని ఉద్దేశంతో ఆలోచించారు. సంఘంలో రుణాలు తీసుకున్న సభ్యులకు అయితే రూ.7 వేల కోట్ల మాత్రమే అయే దని, సంఘంలోని సబ్యుల అందరికి సమానంగా అందజేయాలని,ప్రతి సభ్యురాలికి రూ.10 వేలు ఇవ్వడం కోసం రూ.13 వేల కోట్ల అవుతుందని తెలిపారు.

1995 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో సంఘాల కోసం బీజం వేశారని ఇపుడు అబీజమ ఒక మహావృక్షము అయిదని తెలిపారు.మీరు అందరు క్రమశిక్షణతో సంఘాలు నడపడమ వల్ల సంఘాలు క్రమశిక్షణతో ఆర్థికంగా అభివృద్ధి చేయడం వల్ల గతం లో బ్యాంకులు రూ 5 వేలు రుణాలు ఇచ్చేవారు . ఇపుడు రూ 15 లక్షలలు ఇస్తున్నారని తెలిపారు.రాష్ట్ర విభజన జరిగి రూ 16 వేల కోట్ల లోటు బడ్జెట్ వున్నాను రాష్టాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారంటే అనుభవం కలిగిన ఒక సంవర్ధమైన నాయకుడు గనుక ఇన్ని కార్యక్రమాలను ఆములుచేస్తున్నారని, ఈ నాయకుని ఇంకా పది కాలంపాటు ఉంటే మన బిడ్డల భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలిపారు.
కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా నిజమైన అర్హులకు అందరికి ప్రభుత్వం పథకాలను అందజేయడం జరుగుతుందని అన్నారు.

గ్రామాలలో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎన్నడూ జరగని అభివృధ్ధి ఈ నాలుగేళ్ళలో జరగడం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతోందన్నారు. అన్ని గ్రామాలకు సిసి రోడ్లు,గ్రామాలకు గ్రామాలకు రోడ్లు అనుసందానం,యల్ ఇ డి బల్బులు,త్రాగునీరు సరఫరా, ఇంటింటి నుండి చెత్త సేకరణ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతోందని వివరించారు. గతంలో అయితే పెంచన్లు సక్రమంగా అర్హులకు చేరేదిలేదని,ఈ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ న నేరుగా లబ్దిదారులకు ఇండ్లు కు వెళ్లి వారి వేళ్ళు గుర్తులవేసిన తరువాతనే పారదర్శకంగా పెంచన్లు,రేషన్ సరుకులను నిజమైన లబ్దిదారులకు అందజేయడం జరువుతుందని తెలిపారు.

రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేయడం, రూ.50 వేలు ఉన్న రైతులకు ఒకే సారి రుణమాఫీ అయిందని, ఇప్పటికి 3 దశలలో రైతుల బ్యాంకుల ఖాతాలకు జమచేయడం జరిగిందని, మిగిలినది కూడా అందజేయడం జరుగుతుందన్నారు. రైతులకు ఉచితంగా సూక్ష్మ పోషకాలు, డ్రిప్ పరికరాలు,ట్రాక్టర్లతో పాటు విత్తనాలు, అర్హులైన వారికి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడంజరిగిందని అన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు .ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయమ కొరకు రాయితీ పై వ్యవసాయ యంత్రలను,రైతు రథం పథకం ద్వారా ట్రాక్టర్లను అందజేయడం తోపాటుగా డ్రిప్ పరికరాలను యస్ సి,యస్ టి ల రైతులకు వంద శాతం ఉచితంగాను 5 ఎకరాల లోపు మిగిలిన రైతులకు 90 శాతం రాయితీ తో డ్రిప్ పరికరాల ను అందిస్తున్నాముని తెలిపారు.

ఇటీవల కావలసిన రైతులకు ఉచితంగా ఉలవలను పంపిణీ చేశామని,గ్రామీణ ప్రాంతాల్లో అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగి కుటుంబంలో వ్యక్తి చనిపోతే వారికోసం చంద్రన్న బీమా పథకం ద్వారా రూ.5 లక్షలు అందజేయడం జరుగుతుందని అన్నారు. బడుగు బలహీన వర్గాల వారి గృహాల లో వివాహం చేసుకొనుటకు చాలా ఇబ్బందులు వుంటాయని వారికోసం చంద్రన్న పెండ్లి కానుక ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

అక్టోబర్ గాంధీ జయంతి నుంచి ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా డిగ్రీ వరకు చదువు కొని నిరువుద్యోగిలు గా ఉన్న 22 సం .35 సం లో పు యువతకు నెలకు రూ.వెయ్యి రూపాయల తో పాటుగా వారి ఉపాధి కల్పించుటకు వృత్తి నైపుణ్యం కలిగించి పరిశ్రమల ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కలిగించడం జరుగుతుందని తెలిపారు. ఎవ్వరు లేని వంటరి మహిళలకు పెంచన్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. అర్హులైన పేదలకు అందరికి ఇళ్ళు,పెంచన్లు, రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఇంకా పది కాలాలపాటు ఉంటే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొనుటకు అవకాశాలు వుంటాయని తెలిపారు.

వైద్య ఆరోగ్యశాఖ ద్వారా గర్భం దాల్చిన నుంచి అన్ని రకాల టీకాలు వేయించి, ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించి తల్లిబిడ్డ ఎస్ప్రెస్స్ ద్వారా వారిని ఇంటి దగ్గర దింపి బిడ్డకు యన్.టి.ఆర్, బసవతారకం క్వాటీనులను అందచేయడం జరుగుతుందని తెలిపారు. అంగన్ వాడి కేంద్రాల ద్వారా పిల్లలకు, గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నామని తెలిపారు.9 వతరగతి చదివే బాలికలు మధ్యలో చదువు ఆపకుండా చదువు కొనుటకు సైకిలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. జిల్లాల.మైనార్టీల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, మసీదులో ప్రార్థనలు చేసే ఇమామలు మౌజులకు జీతం ఇస్తుందని, విదేశీలకు వెళ్లి చదువు కొనే పేద విద్యార్థులకు యన్ టి ఆర్ విద్యా పథకం ద్వారా విదేశాలకు వెళ్లి చదువుకోవడం కోసం రూ.10 లక్షలు అందజేస్తుందని తెలిపారు. సంఘ మిత్రుల జీతం ను 3 వేలు పెంచి రూ 5 వేలు అందజేయుటకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని కొద్దీ రోజులలో జి .ఓ వస్తాందని సంఘ మిత్రలకు మంత్రి తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో పి.డి డిఆర్డీఏ రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణా ముఖచిత్రలను మార్చిన వ్యక్తులు మహిళా సంఘాలు.సంఘం అనే బీజం తో మొదలు అయి క్రమశిక్షణా ఆర్థికంగా అభివృద్ధి చెంది నేడు మహా వృక్షమ నీడలో వున్నారని తెలిపారు. సంఘంలో చేరిన మహిళా సభ్యులు ఆదాయం పెంచుకోవడం తో పాటుగా గ్రామాల అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. ఈ సమావేశంలో వి ఓలు,సంఘ మిత్రాలు మహిళా సంఘాలు అభివృద్ధి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు చేస్తున్న కృషిని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కోశాధికారి బాలాజీ,పలమనేరు మార్కెటింగ్ చెర్మాన్ హేమంత్ కుమార్ రెడ్డి, గంగవరం జడ్పీటీసీ సోమూసేఖర్ గౌడు,మంజుల,ఏరియా కోఆర్డ నేటర్,వెంకటేష్,చెంగా రెడ్డి ఆ పి యం, 5 మండలాల తహశీల్దారు లు,యం. పి
డి.ఓలు రాజగోపాల్,విద్యారమ ,5 మండలాల జడ్పీటీసీ, యం పి టి సి,సభ్యులు, యం. పి.పిలు.

 

వర్గీకరణపై పార్టీలు రూట్ మ్యాప్ ఇవ్వాలి : ఎమ్మార్పీఎస్

Tags:Where are we going to enter the country in Andhra Pradesh,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *