Natyam ad

2000 రూపాయల నోట్లు కనిపించకుండా ఎక్కడికి పారి పోయినాయి?

-2000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్న నోట్లు ఎందుకు కనిపించడం లేదు?

-చలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లు సంఖ్య బాగా తగ్గిపోయింది కారణం ఏమై ఉండవచ్చు!

-బ్యాంకుల్లో కూడా దొరకడం లేదు దీని వెనకాల ఉన్న అంతర్గత రహస్యం ఏంటి?

 

Post Midle

అమరావతి ముచ్చట్లు:

భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రణ 2016- 2017 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ రూపాయల 2000 రూపాయల నోట్లను ముద్రించిందని అధికారికంగా వెల్లడించింది.స్వచ్ఛమైన రాజకీయాల కోసం… కలుషితమైన రాజకీయాలను, అవినీతిని అంతం చేయడానికి నకిలీ కరెన్సీని అరికట్టడానికి మరియు భారతదేశంలో అవినీతి మరియు నల్లధనంపై పోరాడటానికి గల కారణాలు 8 వ తేదీ నవంబర్ 2016న, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వీటిని డిమానిటైజేషన్ చేశారు.! ఈ విషయం యావత్తు దేశ ప్రజలందరికీ తెలిసినదే దీని ద్వారా ఎంతో మంది చాలా ఇబ్బందులు పడ్డారు ,చాలామంది కూడా చనిపోయారు బాగానే ఉంది మరి కొత్త నోట్లు 2000 ఎందుకు కనిపించలేకపోతున్నాయి!?

 

 

 

అదేవిధంగా 2000 రూపాయల నోట్లు 2017-2018 సంవత్సరంలో 111.307 మిలియన్ నోట్లకు పడిపోయింది. మరియు 46.690 మిలియన్ నోట్లకు తగ్గించబడింది ఎందుకు? ఏమైనా నరేంద్ర మోడీ గారు 2000 నోట్లను ఒకవేళ రద్దు చేస్తే రాజకీయ పార్టీలు విలవిల కొట్టుకుంటాయి అసలు ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయడానికి ఏమైనా కుట్ర జరుగుతుందా!? మరి 2000 నోటు రూపాయలు ఎక్కడికి పారిపోయాయి? అదేవిధంగా మనదేశంలో 2000 రూపాయల నోటు అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నవంబర్ 8వ తేదీ 2016 వ సంవత్సరంలో పాత 500 రూపాయలు మరియు పాత (1000) వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత సెంట్రల్ బ్యాంక్ కొత్త 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టింది. అదేవిధంగా (ఎన్సీ.ఆర్. బీ .డేటా) నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వివరాల ప్రకారం దేశంలో స్వాధీనం చేసుకున్న 2000 రూపాయల నోట్ల డినామినేషన్ నకిలీ కరెన్సీ నోట్ల సంఖ్య 2016 మరియు 2020 సంవత్సరం మధ్యన గణనీయంగా పెరిగిందని 2,272 నుండి 2,44,834 ఈ డబ్బులు అన్ని ముక్కలకు పెరిగిందని ప్రభుత్వము ఇటీవల పార్లమెంటులో ఒక సమాధానములో ఆశ్చర్యకరంగా పేర్కొంది ! దీని వెనకాల ఉన్న అంతర్గత రహస్యాలు ఏంటి? ఎవరికి అర్థం కాని ప్రశ్న.? నరేంద్ర మోడీ గారు నిజాయితీగల రాజకీయాలను చూడాలనుకుంటే ప్రస్తుతం 2000 రూపాయల నోట్లను మార్పిడి డీమానిటైజేషన్ చేస్తే ! రాజకీయ పార్టీలు విలవిల కొట్టుకుంటాయి.

 

 

 

 

రాజకీయాలను అడ్డుపెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొని కోట్ల సంపదలను కూడగట్టినటువంటి వాళ్లకు ముగింపు దశ చేరుకుంటుంది. కొందరు సమాచార హక్కు చట్టం మేరకు అడిగిన ప్రకారం అలాగే డేటా ప్రకారం 2016 వ సంవత్సరంలో మనదేశంలో పట్టుబడిన మొత్తము రెండువేల రూపాయల నకిలీ నోట్ల సంఖ్య 2,272, అదేవిధంగా 2017 సంవత్సరం వచ్చేసరికి నకిలీ నోట్ల సంఖ్య 74,898 పెరిగింది. 2019లో సంవత్సరంలో నకిలీ నోట్ల సంఖ్య 90,566 కి పెరిగినట్లు బ్యాంకు వ్యవస్థలు, ప్రభుత్వాలు, వెల్లడించాయి. అయితే 2020 వ సంవత్సరంలో పెద్ద నోట్ల రద్దుకు ముందు 2,44,834, రూపాయలు మొక్కలకు పెరిగింది అంటూ ఆర్టిఐ ప్రత్యుత్తరం ప్రకారం సెంట్రల్ బ్యాంకు వారు 2020 సంవత్సరము నుండి 2000 రూపాయల ముద్రణను నిలిపివేసినట్లు వెల్లడించింది. అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థలో కనుగొనబడిన నకిలీ నోట్లో 90 శాతానికి పైగా తక్కువ నాణ్యతతో ఉన్నట్లు వెల్లడించాయి. ప్రధాన భద్రత ఫీచర్లు ఏవి కూడా రాజీ పడలేదు. వాటి యొక్క భద్రతా లక్షణాలు వివరాలను సాధారణ ప్రజల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ప్రదర్శించబడతాయి అని సమాధానము పార్లమెంటులో తెలిపింది .

 

 

 

మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛమైన రాజకీయాల కోసం కలుషితమైన రాజకీయాలను అంతం చేయడానికి నకిలీ కరెన్సీని అరికట్టడానికి మరియు భారతదేశంలో అవినీతి మరియు నల్లదానంపై పోరాడటానికి గల కారణాలతో నవంబర్ 8 2016న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వీటిని డిమానిటైజ్ చేశారు. మరియు ఇప్పుడు కూడా అదే ఆలోచనతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2000 రూపాయల నోటు రద్దు పరిచినట్లయితే రాజకీయపార్టీల నాయకులు, అధినేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెట్టుబడుదారులు, “విలవిల కొట్టుకుంటాయి” ప్రస్తుతము 2000 రూపాయల నోటు మినహాయిస్తే మనకు ₹10 నోటు 20 రూపాయల నోటు 50 రూపాయల నోటు 100 రూపాయల నోటు 200 రూపాయల నోటు 500 రూపాయల నోట్లు మనకు విపరీతంగానే కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో వేచి చూద్దాం!

 

Tags:Where did the 2000 rupee notes go?

Post Midle