మంత్రులకు నిబంధనలు వర్తించవా

హైదరాబాద్ ముచ్చట్లు:
లంగాణ వ్యాప్తంగా కరోనా వేళ లాక్ డౌన్ నిబంధనల్ని పోలీసులు కఠినంగా అమలు చేశారు. ఎవరు ఏ మాత్రం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. చాలామందికి జరిమానాలు కూడా విధించారు. వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా పలు చోట్ల రాజకీయ నేతల్ని సైతం పోలీసులు విడిచి పెట్టలేదు. పోలీసు అధికారులకు కూడా మాస్క్ లేకుండా కనిపిస్తే ఫైన్ విధించారు. మాస్కు పెట్టుకోకుంటే వెయ్యి రూపాయల ఫైన్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఇంటి గడప దాటి బైటకు వచ్చిన ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించాల్సిందేనని, లేకుంటే స్పాట్ విధిస్తున్నామని, ఎపిడమిక్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేస్తున్నామని స్వయంగా డీజీపీ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు లక్షలాది మందిపై కేసులు నమోదు చేసి కోట్లాది రూపాయల ఫైన్ వసూలు చేశారు. ఇంత చేసిన పోలీస్ బాస్.. పక్కనే ఉన్న మంత్రిని మాత్రం పట్టించుకోకుండా పోయారు. మంత్రి తలసాని మాత్రం మాస్కు పెట్టుకోకుండా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. పక్కనే ఉన్న డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ఈ విషయాన్ని చూసీ చూడనట్లు ఉండిపోయారు.పోలీసు స్టేషన్ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం అతిథిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాస్కు పెట్టుకోకుండా ఉన్నారు. అయితే అక్కడ ఉన్న పోలీస్ బాస్ కాని, నగర కమిషనర్‌ కానీ ఈ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. స్పాట్ మంత్రికి ఫైన్ వేయలేదు. కేసు నమోదు చేయలేదు. దీంతో మంత్రి తీరుపై విమర్శలు వస్తున్నాయి. లాక్‌డౌన్ నిబంధనలకు మంత్రికి వర్తించవా? అంటూ నెటిజన్స్, ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Whether the rules apply to ministers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *