కన్నడ తెలుగు ఓటరు ఎటు వైపు
అనంతపురం ముచ్చట్లు:
కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ఓటర్లు ఎవరికి మద్దతు ఇచ్చారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో తెలుగు ఓటర్లు ఎవరి వైపు నిలిచారనేది ఆసక్తి కర అంశంగా మారింది. కర్ణాటకలో 12 జిల్లాల్లో తెలుగు ప్రజలు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు. ఆ రాష్ట్రంలో 15 శాతం తెలుగు వారే. 40 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసారు. ఈ 12 జిల్లాల్లో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు ఏ పార్టీని గెలపించారు..ఎవరిని ఓడించారనే అంశం పైన ఆసక్తి కర ఫలితాలు వెల్లడవుతున్నాయి. తెలుగు ఓటర్ల ప్రభావం: కర్ణాటకలోని బళ్లారి, కోలార్, బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్, రాయ్‌చూర్, కొప్పల, తుమకూరు, చిత్రదుర్గ, చిక్కబల్లాపురా, యాదగిరి, బీదర్, కాలబురగి జిల్లాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చిన తెలుగు ఓటర్లు ఎక్కువ. కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఓటర్ల సంఖ్యకు మించి వీరి ఓటర్ల సంఖ్య ఉంది. కోలార్ జిల్లాల్లో ఎక్కువ శాతం ఓటర్లు తెలుగు ప్రజలే. వీరు ఆ జిల్లాలోని 6 నియోజకవర్గాలను బలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అలాగే బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్ పరిధిలోనూ తెలుగు ఓట్లర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. వీరు 25 నియోజకవర్గాల్లో ఎన్నికల్లో ప్రభావితం చేసారు.
ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ఫలితాలు ఆసక్తి కరంగా ఉన్నాయి. తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఫలితాలు పూర్తిగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి. తెలుగు ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్న ఎనిమిది జిల్లాల్లోని నియోజకవర్గాలను పరిశీలిస్తే 43 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవగా, 27 నియోజకవర్గాల్లో బీజేపీ విసయం సాధించింది. యాదగిరి జిల్లాలో బీజేపీకి ఒక్క సీటు రాలేదు. అక్కడ కాంగ్రెస్ 3, జేడీఎస్ 1 గెలుచుకున్నాయి. రాయచూర్ లో బీజేపీకి 2, కాంగ్రెస్ 4, జేడీఎస్ 1 స్థానం గెలుచుకున్నాయి. బీదర్ లో బీజేపీకి 4, కాంగ్రెస్ 2 సీట్లు సాధించింది. కోలార్ లో కాంగ్రెస్ కు 4, జేడీఎస్ కు 2 సీట్లు వచ్చాయి. బళ్లారి లో బీజేపీకి ఒక్క స్థానం రాలేదు. కాంగ్రెస్ 5 చోట్ల గెలుపొందింది. చిక్ బళ్లాపూర్ లో బీజేపీకి అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ 4, జేడీఎస్ కు 2 సీట్లు వచ్చాయి.

బెంగళూరు అర్బన్ లో 28 స్థానాలు ఉండగా బీజేపీకి 15, కాంగ్రెస్ కు 13 సీట్లు వచ్చాయి. బెంగళూరు రూరల్ లో బీజేపీకి 4, కాంగ్రెస్ కు 1, జేడీఎస్ కు 3 స్థానాలు దక్కాయి. తుముకూరులో బీజేపీకి 2, కాంగ్రెస్ కు 7, జేడీఎస్ కు 2 సీట్లు దక్కాయి. దీంతో, ఇప్పుడు తెలుగు ఓటర్లు ప్రభావం చూపే నియోజవకర్గాల్లో బీజేపీ ఓడిపోవటంతో కొత్త సమీకరణాలు తెర పైకి వస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ – జనసేన బీజేపీతో కలిసి పొత్తు దిశగా ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ ఫలితాలు ప్రజల నాడిని స్పష్టం చేస్తున్నాయనే అభిప్రాయం ఉంది. మరి..కాంగ్రెస్ ను గెలిపించి..బీజేపీని ఓడించిన తెలుగు ఓటర్ల తీర్పును తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు ఏ రకంగా స్వీకరిస్తాయో చూడాలి.
Tags: Which side is the Kannada Telugu voter on?
