రోడ్డు భద్రతలు పాటించని వారిపై కొరడ- ఎంవిఐ సుప్రియ

– ఆటోలు, ద్విచక్రవాహనాలు సీజ్‌

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

నిబంధనలకు విరుద్ధంగా , రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించకుండ ఇష్టారాజ్యాంగా తిరుగుతున్న ద్విచక్రవాహనాలు, ఆటోలపై ఎంవిఐ సుప్రియ కొరడ ఝులిపించారు. ఆటోలను, ద్విచక్రవాహనాలను సీజ్‌ చేసి , పలువురికి జరిమానాలు విధించారు. మంగళవారం ఆమె రహదారులపై తనిఖీ చేపట్టారు. ఆటోలలో స్కూల్‌ పిల్లలను అధికంగా ఎక్కించి తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టప్రకారం ఆటోలలో ముగ్గరికి మించి ఎక్కువ మందిని తీసుకెళ్లరాదు. దీనిపై రెండు స్కూల్‌ ఆటోలను సీజ్‌ చేశారు. అలాగే మైనర్లకు ద్విచక్రవాహనాలను నడపడంతో 8 వాహనాలను పట్టుకుని , కేసులు నమోదు చేసి సీజ్‌ చేశారు. మరి కొన్ని వాహనాలకు జరిమానాలు విధించారు. ఈసందర్భంగా ఎంవిఐ విలేకరులతో మాట్లాడుతూ డీటీసీ నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. నిబంధనల మేరకు స్కూల్‌ బస్సులలోనే పిల్లలను తరలించాలన్నారు. ఆటోలలో తీసుకొస్తే ఆటోలు సీజ్‌ చేసి, పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి నివేదికలు పంపుతామన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వడంతో వారికి రహదారి మెలుకవలు తెలియక , ప్రమాదాలకు లోనౌతున్నారని తెలిపారు. ఇలాంటి వాహనాలు దొరికితే సీజ్‌ చేసి, కోర్టుకు పంపుతామన్నారు. రహదారిపై ప్రయాణించే ప్రతి వాహనానికి పర్మిట్లు, ఇన్సూరెన్స్, ఎఫ్‌సీ, ట్యాక్స్లు, పొల్యూషన్‌, డ్రైవింగ్‌ లైసెన్సులు కలిగి ఉండాలన్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఈ విషయాలను గమనించి పాఠశాలలకు ఆర్టీసి బస్సులను వినియోగించుకోవాలని లేకపోతే ఆటోలలో ముగ్గరిని మాత్రమే పంపాలని సూచించారు. రహదారి భద్రతలను, చట్టాలను ప్రజలు అవగాహన చేసుకోవాలని కోరారు.

Tags: Whip against those who do not follow road safety – MVI Supriya

Post Midle