ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినవారిపై కొరడా జగిత్యాల ట్రాఫిక్ ఎస్సై నవత

జగిత్యాల  ముచ్చట్లు:
జగిత్యాల పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినవారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. శనివారం జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్, మార్కెట్, తహశీల్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎస్సై దుంబాల  నవతా సిబ్బందితో కలిసి  స్పెషల్ డ్రైవ్లో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు  ఉల్లంగిస్తున్న వాహనదారులకు జరిమానాలు విధించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలు, చలాన్ పెండింగ్ లో ఉన్న వాహనాలు ఆపి క్లియర్ చేస్తేనే వదిలిపెట్టారు. రోడ్లపై నిలిపిన కార్లు, ధ్విచక్ర వాహనాలపై జరిమానాలు విధించారు. ఈసందర్బంగా ఎస్సై నవతా మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ఎవరూ ఉల్లంగించిన చర్యలు తీసుకుంటామన్నారు. చాలాన్ పెండింగ్లో ఉన్న వాహనదారులు వెంటనే క్లియర్ చేయాలని సుచించారు. దుకణాల ముందు యజమానులు ఎలాంటి నేమ్ బోర్డులు, వస్తువులు పెట్టరాదని, పెడితే చర్యలు తప్పవని నవతా హెచ్చరించారు. దుకాణాల ముందు ప్రజలకు ఇబ్బంధులు కలుగకుండా వాహనాల పార్కింగ్ చేసుకోవాలన్నారు. వాహన దారులు హెల్మెట్ తప్పక ధరించాలని, వాహనాలకు సంబంధించిన కాగితాలను పోలీస్ సిబ్బంది అడిగితే చూపించాలని, వాహనాలకు నంబర్ప్లేట్  తప్పనిసరిగా ఉండాలని, నిబంధనలు పాటించి సహకరించాలని నవతా వాహనదారులకు సూచించారు. ఏఎస్ఐ వేణు, సిబ్బంది పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Whip on traffic rules violators
Jagityala Traffic Essay Navata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *