ఓటీటీకి టెంప్ట్ అవుతున్నారే. 

Date:16/09/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

ఇప్పుడు థియేటర్స్ కన్నా ముందు ఓటిటి వాళ్ళు ఇచ్చే భారీ ఆఫర్స్ కె నిర్మాతలు పడిపోతున్నారు. దిల్ రాజు ఎలాగైనా వి ని థియేటర్స్ లోనే దింపుతాడనుకుంటే.. చి\వరికి దిల్ రాజే ఓటిటి కి సై అన్నాడు. దిల్ రాజు గట్టిగ ఉంటె మిగతావాళ్ళెవరూ ఓటిటి బాట పట్టివారే కాదు. కానీ దిల్ రాజు లాంటి దిగ్గజానికే థియేటర్స్ బంద్ గదడలాడించింది అంటే మిగతా నిర్మాతలో లెక్కా..? అందుకే వారు కూడా మెల్లగా ఓటిటీస్ కి టెంప్ట్ అవుతున్నారు. థియేటర్స్ బంద్ నేపథ్యంలో ఓటిటి లు కూడా భారీ ధరకి నిర్మాతలను పడెయ్యడానికే కంకణం కట్టుకున్నాయి. ఇక వి తర్వాత ఒరేయ్ బుజ్జిగా లైన్ లో ఉంటె..ఆ తరవాత నిశ్శబ్దానికి డీల్ సెట్ అయ్యింది అన్నా ప్రస్తుతానికి క్లారిటీ లేదు.తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ కరోనా ని లెక్క చెయ్యకుండా రీసెంట్ గా సెట్స్ మీదకెళ్లింది. సింగిల్ షెడ్యూల్ లో లవ్ స్టోరీ చిత్రీకరణ ఫినిష్ చెయ్యాలని అనుకుంటున్నాడట శేఖర్ కమ్ముల. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే సినిమాపై ఉన్నా క్రేజ్ తో లవ్ స్టోరీకి ఓ ఓటిటి సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చిందట. లవ్ స్టోరీ కి శేఖర్ కమ్ముల, సాయి పల్లవి మీదున్న అంచనాలతో ఏకంగా 30 కోట్ల ఆఫర్ వచ్చినట్టుగా టాక్. అయితే ఈ సినిమా నిర్మాతలకు లవ్ స్టోరీనే ఫస్ట్ సినిమా కావడంతో.. ఎన్ని రోజులు లేటయినా సినిమాని థియేటర్స్ లోనే విడుదల చెయ్యాలని చూస్తున్నారట. కారణం వారికీ బోలెడన్ని థియేటర్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళే ఓటిటికి వెళితే ఎలా అనే ఆలోచనలో ఉన్నారట.

నారా లోకేష్ టార్గెట్…

Tags:Who are tempted to OTT.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *