రేషన్ బియ్యం దొంగలు ఏవరు – డీలర్లా లేక యమ్ డీయూలా

నంద్యాల ముచ్చట్లు:

 

నంద్యాల డివిజన్ పరిధిలో ప్రతి రోజూ ఏదో ఒక చోట రేషన్ బియ్యం పట్టుకోవడం జరుగుతోంది. ఎవరు దొంగలో అర్థం కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో రేషన్ బియ్యం ఒక్కటి. రేషన్ కార్డు దారులు ఇబ్బందులు పడుతున్నారని వారి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. డీలర్ల ను స్టాకిస్ట్ గా పరిగణలోనికి తీసుకోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రతి రోజూ ఏదో ఒక చోట బియ్యం పోలీసులు మాత్రమే పట్టుకొంటున్నారు  నంద్యాల చెరువు కట్ట వద్ద లారీ లో తరలి పోతున్న 70 క్వింటాళ్ల బియ్యం పోలీసులు పట్టుకున్నారు . అస్సలు రెవెన్యూ అధికారులు ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా బియ్యం పట్టుకున్న దాఖలు కనిపించడం లేదు.అక్రమ రేషన్ బియ్యం మీద ఒకప్పుడు రెవెన్యూ అధికారులు  కేసుల మీద కేసులు రాచేవారు . ఇప్పుడు ఎందుకు రెవెన్యూ డిపార్టుమెంటు వారు పట్టించుకోవడం లేదు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయడం అటో నో లారీలను వారి స్టేషన్ వద్ద ఉంచుకోవడము. బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించడం. అంతే వారి పని వారిది .

 

 

ఈ బియ్యం ఏక్కడ నుంచి వస్తున్నాయి అని పూర్తి దర్యాప్తు చేసే నాథుడే కరువయ్యారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. డివిజన్ పరిధిలో సగం మంది డీలర్లు వారి వారి షాపు వద్ద పంపిణీ చేస్తున్నారు. కార్డు దారులకు తక్కువ తూకం వేచి మిగిలిన బియ్యాన్ని  వ్యాపారులకు అమ్ముతున్నారనేది ప్రదాన ఆరోపణలు వినిపిస్తున్నాయి . లేక యమ్ డీ యమ్ లు కార్డు దారులకు బియ్యం తక్కువ తూకం వేసి మిగిలిన బియ్యాన్ని అక్రమంగా వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు . లేక కార్డు దారులు బియ్యం నచ్చక వ్యాపారులకు అమ్ముతున్నారని కొందరి వాదన. ఏది ఏమైనా నంద్యాల డివిజన్ లో బియ్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా మారింది అని పలువురు అంటున్నారు. ఈ విషయాన్నికొస్తే అంతో ఇంతో కర్నూలు నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నారే తప్ప. రెవిన్యూ అధికారులు ఈ మద్య కాలంలో ఎక్కడ పట్టుకున్న థాఖలు కనిపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Who are the ration rice thieves – dealerla or yum diula

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *