Natyam ad

రాహుల్ కాకుంటే మరెవరూ?

న్యూఢిల్లీ ముచ్చట్లు:


కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆశాజ్యోతి రాహుల్ గాంధీలో మార్పు రాలేదా? పార్టీ పగ్గాలు స్వీకరించేందుకు ఆయన సిద్దంగా లేరా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరపాటుకు గురి చేస్తున్నాయి. నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయేను ఓడించి తిరిగి కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకువస్తారని రాహుల్ పై ఆశలు పెట్టుకున్న వారికి ఆయన మౌనం అంతుచిక్కని ప్రశ్నగా మారుతోంది. ఈ నెల 21 నుంచి కాంగ్రెస్ పార్టీ తదుపరి అధ్యక్షుడి కోసం ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు రాహుల్ గాంధీ నుండి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుండి సోనియా గాంధీ తాత్కాలిక ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు.

 

 

 

అయితే అనారోగ్య కారణాల రీత్యా సోనియా మునుపటిలా యాక్టివ్ గా ఉండటం లేదనే వాదన ఉంది. ఓ వైపు ఈడీ రైడ్స్, పార్టీ క్రమంగా బలహీన పడటం, ఒక్కొక్కరుగా నేతలు తలో దారి వెతుక్కుంటున్న ఈ నేపథ్యంలో తిరిగి రాహుల్ గాంధీ పార్టీ పగ్గారు స్వీకరించాలనే డిమాండ్ కొనసాగుతున్నా.. ఆయన మాత్రం అందుకు సిద్దంగా లేరనే టాక్ వినిపిస్తోంది. బీజేపీని ఎదుర్కొనేందుకు పార్టీ అధ్యక్షుడిగా గాంధీయేతర వ్యక్తి వుంటే బాగుంటుందనే మరో చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. అయితే కాంగ్రెస్‌ చీఫ్‌గా గాంధీయేతర నేత ఉండే అవకాశంపై ఆ పార్టీ చాలా కాలంగా చర్చ జరుగుతున్నా.. ఈ విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ ఈ నెల 20 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 20వ తేదీతో ముగుస్తుంది. అధ్యక్ష పదవిలో లేకపోయినా ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న మార్పులు, చేర్పులు నియామకాలన్నింటికి రాహుల్ గాంధీనే ఆమోదముద్ర వేస్తున్నారు. త్వరలో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీదే కీలక పాత్ర. మోడీ సర్కార్ అవలంభిస్తున్న విధానాలపై రాహుల్ గాంధీ ఇటీవల చురకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారు.

 

 

 

Post Midle

మోడీ సర్కార్ ను ఇరకాటంలో నెట్టేలా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇంత చేస్తున్నా రాహుల్ గాంధీ పార్టీ రథసారథిగా ఉండేందుకు అంగీకారం చెప్పకపోవడం ఆయన అనుచరులు, అభిమానులను కలవరపాటుకు గురి చేస్తోంది. అయితే ఏఐసీసీ కార్యవర్గ పదవుల్లో ఉన్న వారు, పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల్లోనూ మఖ్యమంత్రులు మరోసారి రాహుల్ ను పార్టీ పగ్గాలు స్వీకరించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అప్పటికీ రాహుల్ మనసు మార్చుకోకపోతే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. జరుగుతున్న ప్రచారం ప్రకారం రాహుల్ గాంధీ సిద్దంగా లేకుంటే అధ్యక్ష పదవికి ముకుల్ వాస్నిక్, మల్లికార్జుక ఖర్గే, ప్రియాంక గాంధీ, జైరాం రమేష్, శశిథరూర్, చిదంబరం, గులాం నబీ ఆజాద్ తో పాటు మరి కొందరు సీనియర్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. కపిల్ సిబాల్ వంటి సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీని వదిలి బయటకు వెళ్తున్న క్రమంలో మరింత డ్యామేజ్ జరగముందే ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అయితే రాహుల్ తన పార్టీ నేతలకు గుడ్ న్యూస్ చెబుతాడా? లేక చేతులెత్తేస్తాడా? అనేది త్వరలో తేలనుంది.

 

Tags: Who else if not Rahul?

Post Midle

Leave A Reply

Your email address will not be published.