పెద్దిరెడ్డితో పోటీకి రాగల దమ్ము ఎవరికి ఉంది…

Who has come to fight with Peddireddy?

Who has come to fight with Peddireddy?

– కిషోర్‌ విమర్శలపై మండిపడ్డ రెడ్డెప్ప

Date:15/07/2018

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సాఆర్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , మాజీ ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిలపై పోటీ చేయగల దమ్ము ఎవరికి ఉందో రండి…తేల్చుకుందాం… చిత్తుగా ఓడిపోయి, స్వార్థంతో పార్టీలు మార్చే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డికి పెద్దిరెడ్డి కుటుంభాన్ని విమర్శించే అర్హత లేదంటు వైఎస్సాఆర్సీపి రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు ఎన్‌.రెడ్డెప్ప మండిపడ్డారు. ఆదివారం ఆయన వైఎస్సాఆర్సీపి యువజన సంఘ నాయకుడు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సోమల మండలంలో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్‌ నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, విమర్శలకు ధీటుగా సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ఆయన జిల్లాలో ఓశక్తిగా ఉన్నారని , ఆయనను ఢీ కొనడం ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కిషోర్‌కుమార్‌రెడ్డి ల చేతనే కాలేదు. ఇక నీ చేత ఏం అవుతుందంటు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి చిన్న వయసులో మిధున్‌రెడ్డి ఎంపిగా అత్యధిక మెజార్టీతో గెలుపొంది, పార్లమెంటులో హంద్రినీవా , ప్రత్యేక హ్గదా, బైపాస్‌రోడ్డు,పోలవరం,తాగునీటి ప్రాజెక్టుల పై చర్చలు జరిపారన్నారు.– ఇందుకోసం నిరాహారదీక్షలు చేసి, పదవిని త్యాగం చేసిన ఘనత పెద్దిరెడ్డి కుటుంభానిదన్నారు. బైపాస్‌రోడ్డుకు రూ.320 కోట్లు మంజూరు చేయించి మిధున్‌ రికార్డు సృష్టించారన్నారు. అలాగే ప్రధాని సహాయ నిధి క్రింద 82 మందికి ఆర్థిక సహాయం అందించారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పదవుల కోసం వెళ్లిన కిషోర్‌ , పెద్దిరెడ్డి కుటుంభాన్ని విమర్శించడం దయ్యాలు వేదలు వల్లించినట్లేనన్నారు. కిషోర్‌కు దమ్ముంటే పెద్దిరెడ్డితోనైనా, ఆయన తనయుడు మిధున్‌రెడ్డితోనైనా పోటీకి పుంగనూరుకు రావాలని సవాల్‌ విసిరారు. తెలుగుదేశం పార్టీ ప్రజాసంక్షేమాన్ని విస్మరించి, పోలీసులను పావులుగా వాడుకుంటు తప్పుడు కేసులు బనాయిస్తూ, ప్రతిపక్ష పార్టీని వేదిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలపై తెలుగుదేశం నాయకులు ముఖాముఖి చర్చకు వస్తే తాము సిద్దంగా ఉన్నామంటు రెడ్డెప్ప తెలిపారు. ఈసమావేశంలో కో-ఆఫ్షన్‌మెంబరు ఖాదర్‌బాషా, వైఎస్సాఆర్సీపి నాయకులు జి.చంద్రశేఖర్‌రెడ్డి, సుబ్బన్న, జయకుమార్‌యాదవ్‌ , రెడ్డెప్ప, ధనుంజయరెడ్డి, నరసింహారెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పెద్దిరెడ్డితో పోటీకి రాగల దమ్ము ఎవరికి ఉంది…https://www.telugumuchatlu.com/who-has-come-to-fight-with-peddireddy/

Tags; Who has come to fight with Peddireddy?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *