గుడ్డుగుట్టు ఎవరికెరుక? (విశాఖ)

Who is good? (Vizag)

Who is good? (Vizag)

Date:06/10/2018
విశాఖపట్నం ముచ్చట్లు:
ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనంలో విద్యార్థులందరికీ గుడ్లు అందడం లేదు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట తక్కువ గుడ్లు, తక్కువ మంది ఉన్న పాఠశాలల్లో ఎక్కువ గుడ్లు సరఫరా చేస్తున్నారు. గతేడాది విద్యార్థుల సంఖ్య ఆధారంగానే ఈ ఏడాదీ గుడ్లు పంపిణీ చేస్తుండటంతో సమస్య ఉత్పన్నమవుతోంది. వారానికి ఐదు గుడ్లు పంపిణీపైనా అయోమయం నెలకొంది.
ఐదు గుడ్ల సరఫరాపై విద్యాశాఖ అధికారుల భిన్నమైన ఆదేశాలతో చాలాచోట్ల అమలు కావడం లేదు.
జిల్లాలో 3,864 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. గతేడాది 2,72,535 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఆహారం అందించారు. బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లు అందిస్తున్నారు.
భోజనంలో వారానికి మూడు రోజులు గుడ్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది. తక్కువ మంది విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారు. ఈ ఏడాది 2,61,100 మందికి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 11,435 మంది తక్కువ. గతేడాది నుంచి కాంట్రాక్టర్ ఒకే గుడ్లను సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు పూర్తవుతున్నా పిల్లల సంఖ్య ఆధారంగా గుడ్లు సరఫరా చేయడం లేదు.
గతేడాది పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగానే గుడ్ల సరఫరా జరుగుతుండటంతో ఎక్కువ, తక్కువ సమస్య ఏర్పడింది.మధ్యాహ్న భోజన పథకంలో గుడ్ల పంపిణీలో కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేలా అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ పథకంలో ఒక్కో గుడ్డు సరఫరా చేసేందుకు ప్రభుత్వం గుత్తేదారుకు రూ.4.5 చెల్లిస్తోంది. గత ఏడాది కంటే ఈ ఏడాది 11,435 మంది తగ్గిపోయారు. వాస్తవానికి ఉన్న వారికే గుడ్లు సరఫరా చేయాలి.
లేని వారికి సైతం జిల్లాలో ఈ ఏడాది గుడ్ల సరఫరా జరుగుతోంది. గత ఏడాది వారంలో మూడు రోజులపాటు గుడ్లు అందించే వారు. ఈ ఏడాది రెండు రోజులు అదనంగా ఐదు రోజులు గుడ్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమలు చేస్తోంది. ఈ లెక్కన జిల్లాలో నాలుగు నెలల నుంచి లేని విద్యార్థులకూ గుడ్ల సరఫరా జరుగుతోంది.
ఒక్క రోజు 11,435 మందికి రూ.5,14,575 చొప్పున వారంలో ఐదు రోజులకు రూ.25,72,875 ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా గుడ్ల సరఫరా జరగకపోవడంతో పాఠశాలల పున:ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 60 వారాలపాటు రూ.3,08,74,500 నిధులు గుడ్ల రూపంలో దుర్వినియోగం అయ్యాయి. ఇదంతా తెలిసినా అధికారులు మిన్నకుండిపోవడం గమనార్హం.
Tags:Who is good? (Vizag)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed