నాడి పట్టేదెవరు..? 

Date:18/02/2020

భద్రాచలం ముచ్చట్లు:

 

భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సౌకర్యాల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ చికిత్స అందించేందకు సరిపడా  డార్టర్లు లేరు. వంద

పడకలకే సరిపడా సిబ్బంది లేక అవస్థలు పడుతుండగా 200 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ అయినప్పటికీ ఆ స్థాయిలో పోస్టులు భర్తీ కాలేదు. ఉన్న కొద్దిపాటి వైద్యుల్లో కొందర్ని క్రమశిక్షణ

చర్యల కింద ఇంటికి పంపించి ప్రత్యామ్నాయాలను విస్మరించారు. తాత్కాలిక వైద్యులతో నెట్టుకు రావాలన్నా వారికి సకాలంలో వేతనాలు ఇవ్వకుండా సహనాన్ని పరీక్షిస్తున్నారు. నెలల కొద్దీ

జీత భత్యం లేకుండా సేవలు అందిస్తున్నప్పటికీ వైద్య విధాన పరిషత్‌కు కనీస కనికరం కరవైంది. ఈ పరిస్థితుల్లో ఇక తమ వల్ల కాదని కొంతమంది వైద్యులు పెద్దాసుపత్రికి రాంరాం

అంటున్నారు. ఈ నేపథ్యంలో చొరవ తీసుకుని సర్కారు దవాఖానా కష్టాలను తీర్చాలని పలువురు కోరుతున్నారు. భద్రాచలంలో 1965లో 25 మంచాలతో ఈ ఆస్పత్రి ఏర్పడగా

1966లో 42 పడకల స్థాయికి పెరిగింది. 1998లో 100 పడకలైంది. మన్యంతోపాటు సరిహద్దు ఉన్న ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఏపీ గ్రామాల నుంచి రోగులు నిత్యం ఇక్కడికి వచ్చి వైద్య

సేవలు పొందుతుంటారు. 2015లో రూ.18.14 కోట్లు మంజూరవ్వడంతో మరో 100 మంచాలకు సరిపడా నిర్మాణాలు పూర్తి చేశారు. కొంతకాలంగా 200 పడకల ఆస్పత్రిగా

ఉన్నతి పొంది సేవలు అందిస్తోంది. సుమారు 150 మంది వైద్య సిబ్బంది రెగ్యులర్‌ పద్ధతిపై అవసరం ఉండగా ఈ కోవలో 30 మంది ఉండడమే గగనమైంది. ఖాళీలు భర్తీకి నోచుకోవడం

లేదు. సర్జన్‌ ఆర్‌ఎంవో ఒకటి, సివిల్‌ సర్జన్లు 16, డిప్యూటీ సివిల్‌ సర్జన్లు 9 పోస్టులు అవసరం ఉండగా ఇందులో అన్నీ ఖాళీలే. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు 30 మందికి సగం మంది లేరు.

51 మంది స్టాఫ్‌ నర్సులుకు 43 ఖాళీలు ఉన్నాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్ఛు తాత్కాలిక పద్ధతిలో నియామకాలు చేపట్టి వేతనాలు చెల్లించకపోవడంతో ఇప్పటికే ఇద్దరు

గైనకాలజిస్టులు మానేశారు. ఇంకొంత మంది ఉద్యోగం మానేసేలా ఉన్నారు. తాత్కాలిక సేవలు అందిస్తున్న డా.విజయరావుకు పది నెలల వేతనం ఇస్తారో? లేదో? అంతు చిక్కడం లేదు.

అధికారులు తనిఖీల పేరుతో హడావుడి చేయడమేగానీ ఈ వైద్యులకు ఒరిగింది శూన్యం. ఇటీవల ఇక్కడ ఇద్దరు వైద్యులను సస్పెండ్‌ చేసినప్పటికీ వారి స్థానంలో కొత్తగా ఎవర్నీ

నియమించకపోవడంతో సాధారణ శస్త్ర చికిత్సల కోసం వచ్చిన వాళ్లను రిఫరల్‌ చేయాల్సి వస్తుంది. ఈ ఖాళీల గురించి తెలుసుకుని తాత్కాలిక పద్ధతిలో చేరేందుకు వస్తున్నప్పటికీ వేతనాలు

రావడం లేదని గ్రహించి ఇక తిరిగి చూడడంలేదు. ఇలాంటి ఆసుపత్రి సేవలను ప్రత్యేకంగా గుర్తించి అదనపు నిధులు మంజూరు చేసి అంతరాష్ట్ర ఆసుపత్రిగా తీర్చిదిద్దాల్సి ఉంది. వైద్య

నిపుణులను భర్తీ చేయకపోవడంతో ఉనికి కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ మెరుగైన సేవలు అందిస్తున్నందున మరోసారి కాయకల్పకు ఎంపికయ్యేందుకు

అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో ప్రాథమిక తనిఖీలు పూర్తయ్యాయి. ఎంతటి క్లిష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ కాయకల్పను సాధిస్తామన్న ధీమా ఇక్కడి సిబ్బందిలో

కనిపిస్తుంది. వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చి ఎక్కడా చెత్తాచెదారం చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోగులకు చికిత్స జరిగే అన్ని విభాగాలు శుభ్రంగా ఉంచుతున్నారు.

అక్రమాలపై అంతస్తులు  

Tags: Who is nervous?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *