Natyam ad

పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుడెవరు ..?-వైఎస్సార్‌సిపి నేతల ప్రశ్న

పుంగనూరు ముచ్చట్లు:
 
రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో తెలుగుదేశం పార్టీకి రోజుకోనాయకుడు పుట్టుకొస్తున్నారని, ఇక్కడ పోటీ చేసే నాయకుడెవరో చెప్పాలంటు వైఎస్సార్‌సిపి నేతలు ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం పార్టీ మండల కన్వీనర్‌ చెంగారెడ్డి, మిధున్‌ యువసేన అధ్యక్షుడు జయకృష్ణ, కౌన్సిలర్లు రెడ్డెమ్మ, మనోహర్‌ , పట్టణ కార్యదర్శి హరినాథరెడ్డి లు విలేకరుల సమావేశం నిర్వహించారు. చెంగారెడ్డి మాట్లాడుతూ స్థాయి తప్పి వైఎస్సార్‌సిపిని , మంత్రి పెద్దిరెడ్డిని విమర్శిస్తే సహించేది లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్న తెలుగుదేశం ఎన్నికల్లో రిగ్గింగ్‌లు చేశారని స్థానిక తెలుగుదేశం నాయకులు మతిబ్రమించి మాట్లాడుతున్నారని తెలిపారు. పుంగనూరు ఇన్‌చార్జ్లు 10 మంది మార్చారని ఎద్దెవా చేశారు. మంత్రి పెద్దిరెడ్డి నాయకత్వంలో పుంగనూరులో ఎంతో అభివృద్ధి జరుగుతోందని ఏకైక నాయకుడు పెద్దిరెడ్డి అని స్పష్టం చేశారు. జయకృష్ణ, మనోహర్‌ , కౌన్సిలర్లు రెడ్డెమ్మ, విజయభారతి, రాజశేఖర్‌రెడ్డి, హరినాథరెడ్డి మాట్లాడుతూ దమ్ముంటే పెద్దిరెడ్డిపై పోటీకి చంద్రబాబునాయుడు రావాలని , సత్తా ఏమిటో చూపిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ మహిళా నాయకులు సుబ్బమ్మ, తులసెమ్మతో పాటు పార్టీ నాయకులు అస్లాంమురాధి, శ్రీనివాసులు, రమణ తదితరులు పాల్గొన్నారు.
  
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Who is the Telugu Desam leader in Punganur constituency ..? – YSSRCP leaders question