ఈ చరిత్ర ఎందరికి తెలుసు?
అమరావతి ముచ్చట్లు:
బిజెపి జనతా పార్టీలో కలవకముందు జనసంఘ్‌గా ఉండేది.జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామాప్రసాద ముఖర్జీ.శ్యామా ప్రసాద్, డాక్టర్ అంబేద్కర్లు నెహ్రూ మంత్రి వర్గంలో సహచరులు. వీరిద్దరూ మంచి మిత్రులు.ఇద్దరూ నెహ్రూ విధానాలతో విభేదించారు. ఇద్దరూ పదవిని తృణప్రాయంగా వదిలేశారు. కశ్మీర్ మీద నెహ్రూ నిర్ణయాలను శ్యామా ప్రసాద్ తో పాటు అంబేద్కర్ కూడా వ్యతిరేకించారు.శ్యామా ప్రసాద్, అంబేద్కర్ ఇద్దరూ విద్యాధికులు, మేధావులు. వారు ఈ దేశానికి కాంగ్రెస్ పాలన మేలు చేయదని ప్రకటించారు.ప్రథమ లోక్సభ ఎలక్షన్స్ లో నెహ్రూ తన పనిమనిషిని పెట్టి అంబేద్కర్ గారిని ఓడించిన తర్వాత… జన సంఘం పార్టీ పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు పంపినది …ఆనాటి అంబేద్కర్ ఆశయాలను జనసంఘ్ నేత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ “అంత్యోదయ” అనే సిద్ధాంతంగా మలచారు. మోదీజీ ఇపుడు ఆ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఒక ప్రభుత్వ పథకం ఏదైనా ఉంటే అది ఢిల్లీలో ఉన్నవాడికీ, అండమాన్స్ అడవుల్లో ఉన్నవాడికీ ఒకే రోజు అందాలనేది సూక్ష్మంగా అంత్యోదయలో ఒక నిర్ణయం.అంబేద్కర్‌కి బిజెపికి సంబంధం ఏమిటని వ్యాఖ్యానించే వాళ్లు ముఖ్యమంత్రులుగా ఉండటం దౌర్భాగ్యం.

Tags; Who knows this history?
