Who should not drink sanitizers

శానిటైజర్లను ఎవరు తాగరాదు

– నకిలి శానిటైజర్లు విక్రయిస్తే కేసులు
– ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు హెచ్చరిక

Date:08/08/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో ఎవరు శానిటైజర్లను తాగడం, మత్తు పదార్థంలా వినియోగించడం చేయరాదని ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు ప్రజలకు అవగాహన కల్పించారు. శనివారం ఆయన పట్టణంలోని నక్కబండ, ప్రకాశంకాలనీ, ఎన్‌ఎస్‌.పేట, బీడికాలనీ, ఎన్‌టీఆర్‌కాలనీ, భగత్‌సింగ్‌కాలనీలలో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ కరోనా నియంత్రణలో భాగంగా శానిటైజర్లను వ్యక్తిగత పారిశుద్ధ్య కార్యక్రమాలకు మాత్రమే వినియోగించుకోవాలన్నారు. కానీ ప్రజలకు అవగాహన లేకుండ మత్తు పదార్థంలా దానిని వినియోగించడం చేయరాదన్నారు. ప్రజలు ఈ విషయంలో జాగ్రత్తలు వహించాలన్నారు. పట్టణంలోని యువకులు, మేధావులు, ప్రజాప్రతినిధులు, సేవా సంఘాల వారు , సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు తమ తమ ప్రాంతాలలో వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా పట్టణంలోని దుకాణాలలో తనిఖీలు చేపట్టారు. నకిలి శానిటైజర్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి విక్రయదారులపై తమకు రహస్యంగా సమాచారం అందించాలని కోరారు.

శ్రావణ శనివారం పూజలు

Tags: Who should not drink sanitizers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *