షర్మిల వెంట నడిచేదెవరు

Date:23/02/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారు. అందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ ను షర్మిల ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 10వ తేదీన కొత్త పార్టీ ప్రకటన ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. అన్ని జిల్లాల నేతలతో సమావేశాలు ముగిసిన తర్వాత వైఎస్ షర్మిల కొత్త పార్టీపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. పార్టీ పేరు ఏంటి? దాని విధివిధానాలు ఏంటి? అన్న దానిపై వైఎస్ షర్మిల చెప్పనున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. అసలు తెలంగాణలో వైఎస్ షర్మిల క్లిక్ అవుతారా? లేదా? అన్న చర్చ వైసీపీలో జోరుగా చర్చ జరుగుతోంది.జగన్ చెల్లెలుగా వైసీపీ క్యాడర్ లో వైఎస్ షర్మిలకు విశిష్టమైన స్థానం ఉంది. వైఎస్ షర్మిలకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ మంచి పదవి రావాలని క్యాడర్ మొత్తం కోరుకుంది. అయితే వారి ఊహలకు భిన్నంగా వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రకటన వారిని అయోమయంలో పడేసిందనే చెప్పాలి. జగన్ తొలిసారి ఏపీలో గెలవలేకపోయినా రెండోసారి మాత్రం 151 సీట్లతో అధికారంలోకి వచ్చి తమ ఆశలను నెరవేర్చారు. కానీ వైఎస్ షర్మిల తెలంగాణలో అంత ప్రభావం చూపగలదా? అన్న చర్చ నడుస్తోంది.

 

 

 

దీనికి కారణాలు కూడా లేకపోలేదు. వైఎస్ షర్మిల కొత్త పార్టీకి జగన్ అనుమతి లేదంటున్నారు. జగన్ వద్దంటున్నా వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారంటున్నారు. అనేకసార్లు చెప్పినా వినకుండా షర్మిల కొత్త పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వైసీీీపీ నేతల సహకారం వైఎస్ షర్మిలకు ఏ మేరకు ఉంటుందన్నది సందేహంగా మారింది. ఇక గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మినబంటుగా ఉన్న వారు సయితం వైఎస్ షర్మిల పార్టీ వైపు చూస్తారా? అన్న అనుమానం కూడా లేకపోలేదు.ఎందుకంటే తెలంగాణలో పార్టీ కాబట్టి ఆంధ్ర పార్టీగా వైస్ షర్మిల పార్టీపై ముద్ర ఖచ్చితంగా ఉంటుంది. దీంతో ఇక్కడ గెలుపు అవకాశాలు తక్కువనే అభిప్రాయం ఉంది. అందుకోసం తమ రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి వైఎస్ షర్మిల వైపు వస్తారని అనుకోలేం. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో టిక్కెట్ దక్కని వారు మాత్రమే ఇటుచూసే అవకాశం ఉంది. అది ఎన్నికల ముందు మాత్రమే. మరి వైఎస్ షర్మిల క్షేత్రస్థాయిలో సరైన నాయకత్వం లేకుండా ఎలా ముందుకు నడపగలరన్నది ప్రశ్నగా మారింది. జగన్ కు అప్పటి కాంగ్రెస్ నేతలు మద్దతిచ్చారు. వెంట నడిచారు. కానీ ఇప్పుడు షర్మిల వెంట ఎవరు నడుస్తారన్న చర్చ జరగుతోంది.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: Who walks along Sharmila

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *