కాంగ్రెస్ జంపు జిలానీలగురించి ఎందుకు మాట్లాడలేదు-కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామ చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం ఢిల్లీ లో బీజేపీ జాతీయ నేత జేపీ నడ్డాను కలిశారు. ఈసందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… ఈనెల 21వతేదీన బీజేపీలో చేరుతున్నామన్నారు. 12మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి పోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ ప్రాధాన్యత ఇవ్వకపోయినా చాలా కష్టపడి పనిచేశానని అన్నారు. బీజేపీలో చేరాలనుకోవడం మోసం చేయడమా అని ప్రశ్నించారు.: రాష్ట్రంలో అవినీతి కుటుంబ పాలన పోవాలంటే బీజేపీతోనే సాధ్యమని అయన అన్నారు.
నైతికంగా రాజీనామ చేసి పార్టీ మారాను .. ఇది తప్పా అని ప్రశ్నించారు. అమ్ముడు పోయానని నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. నిరూపిస్తావా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. 13 ఏళ్లలో ఒక్క కేసు కూడా తనపై లేదన్నారు. రేవంత్ రెడ్డి పై 120 కేసులు ఏమైనా తెలంగాణ ఉద్యమంలో పెట్టారా? అని రాజగోపాల్రెడ్డి నిలదీశారు.సీఎం కేసీఆర్ ఏనాడూ అపాయింట్ మెంట్ ఇవ్వరు. తెరాస మంత్రులు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వరు.. ప్రజా సమస్యలు వినరు అని అయన ఆరోపించారు. ఎమ్మెల్యే చేయాల్సిన పనులు కూడా చేయనివ్వలేదని.. ప్రొటోకాల్ ఎక్కడా ఫాలో అవ్వలేదని అన్నారు.
తెలంగాణ కోసం తన సోదరుడు వెంకట్ రెడ్డి మంత్రి పదవి త్యాగం చేశారని, వెంకట్ రెడ్డి గురించి అద్దంకి దయాకర్ దారుణంగా మాట్లాడారన్నారు.

Tags: Why didn’t Congress talk about Jilani’s jump – Komatireddy Rajagopal Reddy
