సోషల్లీ కాన్షియస్ గా వైఫ్ ఆఫ్ రామ్

Wife of Ram as Socially Kasius

Wife of Ram as Socially Kasius

Date:19/07/2018
హైదారాబాదు ముచ్చట్లు:
వైఫ్ ఆఫ్ రామ్.. విడుదలకు ముందే ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్ కు వెళ్లిన సినిమా. సోషల్లీ కాన్షియస్ మూవీగా ఇప్పటికే ఈ సినిమాకు మంచి పేరొచ్చింది. ట్రైలర్ కు అద్భుతమైన రెస్సాన్స్ వచ్చింది. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి విజయ్ యొలకంటి దర్శకుడు. ఈ నెల 20న విడుదల కాబోతోన్న ఈ మూవీకి సంబంధించి ఎన్నో విశేషాలను మీడియాతో షేర్ చేసుకున్నారు లక్ష్మి మంచు.సినిమా గురించి మంచు లక్ష్మీ మాట్లాడుతూ…‘‘వైఫ్ ఆఫ్ రామ్ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే థ్రిల్లర్. పాటలు, ఫైట్లు ఉండవు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు. కానీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. తెలుగులో జానర్స్ లో వచ్చే సినిమాలు తక్కువ. వైఫ్ ఆఫ్ రామ్ ఓ కొత్త జానర్ ను పరిచయం చేస్తూ వస్తోన్న సినిమా. ఈ కథ నేను వినగానే ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోయాను. ఇది నిజంగానే జరిగిన కథ. అందుకే ఈ కథను చాలా ప్రేమించాను నేను. ఇది ఓ సాధారణ అమ్మాయి, మహిళ, గృహిణి ప్రయాణం. ఒక సంఘటన తన జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది. అనేది నా పాత్ర. అయితే ఈ మధ్య వినిపిస్తోన్నట్టుగా ఈ సినిమాకు బాలీవుడ్ కహానీకి ఈ సినిమాకూ ఏ సంబధం ఉండదు.’’ అని పేర్కొన్నారు. ఈ నెల 20న విడుదల కాబోతోన్న వైఫ్ ఆఫ్ రామ్ లో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోంది. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా వైఫ్ ఆఫ్ రామ్. విజయ్ యెలకంటి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మంచు మోహన్ బాబుతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు రకుల్ ప్రీత్ సింగ్, దర్శకుడు వంశీ కృష్ణ, నిర్మాత స్వప్నదత్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి.. వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ లాంచ్ వేడుకలో సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాక్షించారు.. వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ ను మోహన్ బాబు ఆవిష్కరించారు..ముఖ్య అతిథిగా హాజరైన రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ నేనే ముందు చూశాను. నాకు థ్రిల్లర్ జానరంటే ఇష్టం. విజయ్ కి ఇది తొలి సినిమాలా లేదు. నేను సినిమాలో కొన్ని సీన్స్ కూడా చూశాను.. అవన్నీ చాలా చాలా బావున్నాయి. నాకు బాగా నచ్చాయి..’ అని పేర్కొంది.వైఫ్ ఆఫ్ రామ్ ప్రధాన పాత్రధారి మంచు లక్ష్మి మాట్లాడుతూ… ‘క్రమశిక్షణ అనే పునాదులపై పెరిగాం మేం. లోకంలో ఎంత ఎక్కువ క్రియేటివ్ పీపుల్ ఉంటే ప్రపంచం అంత ఎక్కువ అందంగా ఉంటుంది. డైరెక్టర్ విజయ్ లేకపోతే ఈ సినిమాయే లేదు. రెండుమూడు కథలు అనుకున్నాం. ఫైనల్ గా ఈ కథను ఓకే చేశాం. ఏనాడూ బడ్జెట్ గురించి ఒక్క రూపాయి పెంచమని అడగలేదు. తనే ఓ నిర్మాతగా ఆలోచించి మరీ తెరకెక్కించారు. నా ఫ్యామిలీయే నా బ్యాక్ బోన్.. మోహన్ బాబు కూతురుగా కాకుండా నా సొంత ప్రతిభతోనే ఎదిగే ప్రయత్నం చేస్తున్నా.. ఇక సినిమా ప్రతిక్షణం థ్రిల్ చేస్తుందనే గ్యారెంటీ మాత్రం ఇస్తున్నాను.. అతి త్వరలోనే ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది’ అని అన్నారు.
సోషల్లీ కాన్షియస్ గా వైఫ్ ఆఫ్ రామ్
Tags:Wife of Ram as Socially Kasius

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *