భర్త మోసం చేసాడని భార్య నిరసన

భద్రాద్రి ముచ్చట్లు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గేటు సమీపంలో  బాధితులు వెంకటలక్ష్మి తనని వాసు నాగేంద్ర అనే వ్యక్తి మోసం చేసాడంటు తనకు న్యాయం చేయాలని నిరసనకు దిగింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త ఇంటిముందు దీక్ష చేపట్టింది. నాగేంద్ర కనపడకపోవడంతో ఐటీసీ గేటు ముందు నిరసన వ్యక్తం చేసింది.  భార్య ఆస్తి అమ్మి అదనపు కట్నం డబ్బులు తెస్తేనే తిరిగి కాపురానిక రానిస్తానని భర్త నాగేంద్ర వేధిస్తున్నట్లు ఆమె ఆరోపించింది. భద్రాచలం పట్టణంలోని శాంతి నగర్ కాలనీకి చెందిన వాసు, ఐటీసీ సెక్యూరిటీ విభాగంలో కార్ల కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు. బాధితురాలిని పోలీసులు పోలీసు స్టేషన్ కు తరలించారు.

 

Tags: Wife protests that husband cheated

Natyam ad