Date:14/12/2019
యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:
ప్రియుడితో కలిసి భర్తను భార్యే హతమార్చిన ఘటన రాజపేట మండలం దూది వెంకటాపురం లో రెండు రోజుల క్రితం జరిగింది. పక్కా ప్లాన్ తో ప్రియుడితో కలిసి కిరోసిన్ పోసి హతమార్చిన భార్య తరువాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేసింది. మూటకొండూరు మండలానికి చెందిన నరేష్, భాగ్యలక్ష్మి లకు గత 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.వీరికి నలుగురు పిల్లలు. అయితే యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన ఐలయ్య తో భాగ్యలక్ష్మీ అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం తెలియడంతో తరచూ కుటుంబంలో కలహాలు రేగాయి. ఇదే నేపథ్యంలో భాగ్యలక్ష్మీ తన పుట్టింటికి వెళ్లిపోయింది. నరేష్ రెండు రోజుల క్రితం భార్య పిల్లలను తీసుకు రావడం వచ్చాడు. తరువాత మద్యం సేవించి అత్తారింటిలోనే బయట పడుకున్నాడు. అదే అదునుగా భావించిన భాగ్యలక్ష్మీ ప్రియుడికి సమాచారం ఇచ్చి పలిచింది. భాగ్యలక్ష్మీ భర్త ముఖంపై దిండును వేసి ఊపిరాడకుండా చేసింది. ప్రియుడు ఐలయ్య నరేష్ కాళ్లు, చేతులు పట్టుకున్నాడు. దాంతోనరేష్ చనిపోయాడు. భర్తది ఆత్మహత్యగా భాగ్యలక్ష్మీ అందరికి చెప్పింది. అయితే, నరేష్ తల్లికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో డొంక కదిలింది. ఇద్దరు నిందితులను పోలీసులు ఆరెస్టు చేసారు.
మహారాష్ట్రలోమూడు సార్లు కంపించన భూమి
Tags:Wife who killed a husband with a boyfriend